Narayanpet: వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్

Narayanpet: వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్
x
Highlights

నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి అన్ని మండలాల వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన వీడియోకాన్ఫరెన్స్ లో కలెక్టర్ హరిచందన...

నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి అన్ని మండలాల వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన వీడియోకాన్ఫరెన్స్ లో కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ... రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా వారు పండించిన పంటను కొనుగోలు చేయాలని, సరిపోయేటన్ని గన్ని బ్యాగులు ఏర్పాటు చేసుకోవాలని, ఒక వేళ గన్ని బ్యాగులు చిరిగినవి ఉంటే పారవేయకుండా వాటిని కుట్టి మరీ వినియోగించుకోవాలని, వరి ధాన్యం రవాణా చేసే వాహనాలను పర్మిషన్ ఇవ్వాలన్నారు. వర్షం పడుతున్నందున ధాన్యం వర్షానికి తడవకుండా తగినన్ని టార్పాలిన్లు ఏర్పాటుచేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కొనుగోలు కేంద్రంలో ఉండేవారు కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్ సి.హెచ్.శ్రీనివాసులు, అగ్రికల్చర్ ఎడి.జాన్ సుధాకర్, మార్కెటింగ్ ఎడి.భాస్కరయ్య, డీఎస్ఓ హాథిరామ్, డిసిఓ ట్రాన్స్ పోర్ట్ డీలర్స్ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories