తెలంగాణలో ఎన్నికల వేళ ప్రలోభాలు.. ఒక్కో ఓటుకు రూ.2-3వేల వరకు పంపిణీ

Distribution of Rs.2-3 thousand per vote in TS Elections 2023
x

తెలంగాణలో ఎన్నికల వేళ ప్రలోభాలు.. ఒక్కో ఓటుకు రూ.2-3వేల వరకు పంపిణీ

Highlights

TS Elections 2023: కొన్ని నియోజకవర్గాల్లో రూ.100 కోట్ల ఖర్చు

TS Elections 2023: ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క... ప్రచారాలు ముగిశాయి... ఇక ప్రలోభాల టైమ్ వచ్చేసింది. ప్రచారం నుంచి పోలింగ్‌ మధ్య ఉన్నది కొన్ని గంటలే అయినా ఈ సమయం ఎంతో కీలకం. ఇన్నాళ్లు ఓటరు నాడి ఎలా ఉన్నా... ఈ కొద్ది గంటల్లో ఆ లెక్కలు మారినా ఆశ్చర్యం లేదు. అందుకే ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు లీడర్లు. ఓటరును తమవైపు తిప్పుకునేందుకు కుస్తీలు పడుతున్నారు. అలా ప్రచారం ముగిసిందో లేదో.. ఇలా ప్రలోభాలకు తెరలేపారు. ఓటుకు వెయ్యి నుంచి మూడు వేల దాకా పంపిణీ మొదలుపెట్టేశారు. ఇలా నిన్నటి నుంచి కోట్లలో డబ్బులు చేతులు మారుతున్నాయి.

కొన్ని ప్రాంతాల్లో ఓటర్లకు నేరుగా డబ్బులు అందుతుండగా.. కొన్ని చోట్ల కులసంఘాల వారీగా.. కాలనీల వారీగా డబ్బులు అందుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో వంద కోట్ల రూపాయలు ఖర్చు అయినా తగ్గేదేలే అంటూ పోటాపోటీగా పంపకాల కార్యక్రమం షురూ చేశారు. రాష్ట్రంలో 50 మంది అభ్యర్థులు డబ్బుల పంపిణీ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇందులో 30 నియోజకవర్గాల్లో ప్రచారాలు ముగియకముందే ముందస్తుగా పంపిణీ చేశారు అభ్యర్థులు.

Show Full Article
Print Article
Next Story
More Stories