CM KCR: గ్రామాల్లో ప్రతి ఇంటికీ 6 మొక్కల చొప్పున పంచాలి

Distribute 6 Plants per Household in the Villages Says CM KCR
x

CM KCR: గ్రామాల్లో ప్రతి ఇంటికీ 6 మొక్కల చొప్పున పంచాలి

Highlights

CM KCR: కలెక్టర్లు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు.

CM KCR: కలెక్టర్లు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. జులై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సూచించారు. నిర్దేశించిన ఏ పని పెండింగ్‌లో ఉండేందుకు వీల్లేదని సీఎం అన్నారు. పంచాయతీరాజ్‌శాఖకు ప్రభుత్వం ఇంతగా సహకరిస్తున్నా పనులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో అధికారులు పునఃసమీక్షించుకోవాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ 6 మొక్కల చొప్పున డోర్‌ టూ డోర్‌ పంచి, నాటించాలని సూచించారు. రాష్ట్రంలో విపరీతంగా పంటలు పండుతున్నాయి. దాంతో దేశ ధాన్యాగారంగా మారిందన్నారు. రాష్ట్రానికి అదనపు రైస్‌ మిల్లులు తక్షణ అవసరమని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

మరోవైపు రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లను 250 ఎకరాలకు తక్కువ కాకుండా ఏర్పాటు చేయాలన్నారు. సెజ్‌ల చుట్టూ బఫర్‌ జోన్‌ ఏర్పాటు చేసి ఆ పరిధిలో లే ఔట్లకు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని సీఎం స్పష్టం చేశారు. కల్తీ విత్తనాల అమ్మకాల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. వ్యవసాయ, పోలీసుశాఖ సమన్వయంతో కల్తీ విత్తనాల అమ్మకాలు అరికట్టాలని వెల్లడించారు. దీనిపై కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులు విశేష అధికారాలను వినియోగించాలని సీఎం అన్నారు. గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలను అధిగమించేందుకు పవర్‌ డేను పాటించాలని ప్రజలకు కేసీఆర్‌ సూచించారు. ప్రజలను చైతన్యపరిచి, శ్రమదానంలో పాల్గొనేలా చేసి, విద్యుత్ సమస్యను పరిష్కరించుకోవాలని సీఎం సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories