మెట్రో ఛార్జీల రాయితీలకు ముగింపు

Suvarna scheme ended in Hyderabad Metro
x

మెట్రో రాయితీలు పోస్టర్ 

Highlights

* ఈనెల 15తో ముగిసిన సువర్ణ ఆఫర్‌ * మరికొంత కాలం పొడిగించాలని ప్రయాణికుల విజ్ఞప్తి * సుముఖంగా లేని ఎల్‌ అండ్‌ టీ మెట్రో * స్మార్ట్‌కార్డుపై 10 శాతం తగ్గింపు యథాతథం

ప్రయాణ ఛార్జీల రాయితీలకు మెట్రో ముగింపు పలికేసింది. మూడు నెలల కాలానికి ప్రవేశపెట్టిన పలు పథకాలు శుక్రవారంతో ముగిశాయి. మరికొంతకాలం పొడిగించాలని ప్రయాణికులు కోరుతున్నా ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో అందుకు సుముఖంగా లేదు. మెట్రోరైలు స్మార్ట్‌కార్డు రీఛార్జ్, ట్రిప్‌ పాసులపై 40 శాతం నగదును వెనక్కి ఇచ్చేలా అక్టోబరు 17న ప్రారంభించిన ప్రయాణికుల రాయితీ పథకాలు జనవరి 15తో ముగిశాయి. స్మార్ట్‌కార్డుపై మొదటి నుంచి ఇస్తున్న 10 శాతం రాయితీ యథాతథంగా కొనసాగుతుందని మెట్రో వర్గాలు తెలిపాయి.

కొవిడ్‌ లాక్‌డౌన్‌ అనంతరం సెప్టెంబరు 7న హైదరాబాద్‌ మెట్రోరైళ్లు పునఃప్రారంభం అయ్యాయి. ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు మెట్రో నాలుగు పథకాలతో ముందుకొచ్చింది. అక్టోబరు 31వరకు ప్రయాణికుల టిక్కెట్లపై ఫ్లాట్‌ 40 శాతం తగ్గింపు ఇచ్చింది. మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌కు ప్రయాణ ఛార్జీ రూ.60కి బదులు రూ.36 వసూలు చేసింది. ఆ తర్వాత నవంబరు 1 నుంచి ప్రయాణికులు ఎవరైనా 20 ట్రిప్పుల టిక్కెట్లు కొంటే.. అదనంగా 10 ట్రిప్పులు ఉచితంగా ఇచ్చింది.

ఇదివరకు స్మార్ట్‌కార్డుపై 10 శాతం రాయితీ ఉంది. ఈ రెండు కలిపి 50 శాతం తగ్గింపు ఇచ్చింది. స్మార్ట్‌కార్డుతో సగం ధరకే ప్రయాణించారు. కొవిడ్‌ సమయంలో మెట్రో ప్రయాణమే చౌకగా ఉండటంతో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వినియోగించుకున్నారు.

కొవిడ్‌ ముందు రోజువారీ సగటు ట్రిప్పులు 4.5 లక్షలు ఉండేవి. ఈ సంఖ్యను చేరుకునేందుకు మరో ఆరు నెలలైనా ఎదురుచూపులు తప్పేలా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుల సంఖ్యను మరింత పెంచుకునేందుకు మరికొన్నాళ్లు ఛార్జీల తగ్గింపు పథకాలు కొనసాగించాలనే డిమాండ్లు వస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories