Lok Sabha Election: కాలి బొటనవేలుతో ఓటేసిన ఆసిఫాబాద్ యువకుడు

Disable Person Inspiration By Using His Leg To Vote In Asifabad District
x

Lok Sabha Election: కాలి బొటనవేలుతో ఓటేసిన ఆసిఫాబాద్ యువకుడు

Highlights

Lok Sabha Election 2024: ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్ కు చెందిన దివ్యాంగ యువకుడు ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

Lok Sabha Election 2024: ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్ కు చెందిన దివ్యాంగ యువకుడు ఓటు హక్కును వినియోగించుకున్నాడు. రెండు చేతులు లేకున్నా ... కాలి బొటనవేలి సహాయంతో తన ఓటును వినియోగించుకున్నాడు. ఈ యువకుడికి రెండు చేతులు లేవు. నడిచేందుకు, రాసేందుకు కాళ్లనే ఉపయోగించుకుంటున్నాడు. అయితే ఎన్నికల సందర్భంగా చేతులు లేని ఈ యువకుడు తన కాలితో ఈవీఎం బటన్ నొక్కి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అర్బన్ ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఓటర్లు అంతగా ఆసక్తి చూపడం లేదని ఓటింగ్ సరళిని పరిశీలిస్తే అర్ధమౌతుంది. కానీ, గ్రామీణ ప్రాంతంలో గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి తమ ఓటుహక్కును వినియోగించుకొనేందుకు ఓటర్లు ఆసక్తిని చూపుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories