తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్... సెప్టెంబ‌ర్ నాటికి కరోనా అదుపులోకి : జీ శ్రీనివాసరావు

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్... సెప్టెంబ‌ర్ నాటికి కరోనా అదుపులోకి : జీ శ్రీనివాసరావు
x
రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్ట‌ర్ జీ శ్రీనివాసరావు
Highlights

Doctor Srinivas Rao Says Coronavirus will control in september : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు కోజుకు అధికమవుతున్న సంగతి తెలిసిందే.

Doctor Srinivas Rao Says Coronavirus will control in september : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు కోజుకు అధికమవుతున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఈ కరోనా కేసులు ఎప్పుడు తగ్గుముఖం పడతాయన్న విషయంపై రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్ట‌ర్ జీ శ్రీనివాసరావు ఓ క్లారిటీని ఇచ్చారు. రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకుడు శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ సెప్టెంబర్‌ చివరి నాటికి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. కరోనా నియంత్రణకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీలో పరిధిలో ఆగస్టు నెలఖారుకల్లా కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. కరోనా బారిన పడిన బాధితులు త్వరగా కోలుకునే విధంగా ప్రభుత్వం ధైర్యం కల్పిస్తుందన్నారు. కరోనా పాజిటివ్‌ వస్తే 14 రోజులకు మందుల కిట్‌ అందజేస్తున్నామన్నారు. కరోనా నిర్ధారణ అయ్యాక చికిత్స విధానం కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. కరోనా బాధితులందరికీ ఒకే విధమైన మందులు ఇవ్వడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. రోగి పరిస్థితి ఆధారంగా అవసరమైన చికిత్సను వైద్యులు సూచిస్తారని తెలిపారు. ఐసోలేషన్‌ సౌకర్యం లేని వారికి కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సరైన సమయంలో మందులు వాడితేనే కరోనా తగ్గుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రూ. 100 కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాల్లోని ఆస్పత్రులు, వైద్య కళాశాలల వాటికి అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. దాదాపు అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పడకలు అందుబాటులోకి తెచ్చామని ఆయన స్పష్టం చేసారు. కరోనా బారిన పడిన వారి కోసం విలువైన ఇంజెక్షన్లను జిల్లా స్థాయి వరకు అందరికీ అందుబాటులో ఉంచామని చెప్పారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సమకూర్చుకునేందుకు టెండర్లు పిలిచామన్నారు. సుమారుగా 18 వేల పడకలకు ఆక్సిజన్‌ అందుబాటులోకి రాబోతుందన్నారు. ఇక కరోనా సోకి వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండి వెంటిలేటర్‌పై ఉంటే ప్లాస్మా ఇచ్చినా ఉపయోగం లేదన్నారు. రాష్ట్రంలో కరోనా రోగుల రికవరీ రేటు పెరిగిందని, కరోనా మరణాల శాతం చాలా వరకు తగ్గిందన్నారు. ప్రభుత్వ నివారణ చర్యలతో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.




Show Full Article
Print Article
Next Story
More Stories