Gruha Lakshmi: గృహలక్ష్మీ పథకానికి దరఖాస్తు చేసుకోడానికి అష్టకష్టాలు.. అందుబాటులోలేని ఆన్ లైన్ సేవలు

Difficulties In Applying For The Gruha Lakshmi Scheme
x

Gruha Lakshmi: గృహలక్ష్మీ పథకానికి దరఖాస్తు చేసుకోడానికి అష్టకష్టాలు.. అందుబాటులోలేని ఆన్ లైన్ సేవలు

Highlights

Gruha Lakshmi: గృహలక్ష్మీ దరఖాస్తు గడువు పెంచాలని డిమాండ్

Gruha Lakshmi: ప్రభుత్వ పథకాల్లో ఆర్థిక ప్రయోజనం పొందేందుకు లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్ సర్వీసులు అవసరాలు తీర్చలేకపోతున్నాయి. దీంతో ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు అందనంత దూరంగా మారుతున్నాయి. ములుగు జిల్లాలో గృహలక్ష్మీ పథకంకింద లబ్ధి పొందేందుకు నానా ఇబ్బందుల పడుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని సంకల్పించింది. సొంతి ఇంటి స్థలం ఉన్నవారికి ప్రభుత్వం తరఫునుంచి ఇల్లుకట్టుకోడానికి 3లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తా్మని ప్రకటించింది. గృహలక్ష్మీ పథకం కింద లబ్ధి పొందేందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారు. జిల్లాల వారీగా 3వేలమంది చొప్పున లబ్ధిదారులను ఎంపికచేసి ఆర్థిక సాయం అందించే విధంగా చర్యలు చేపట్టారు.

గృహలక్ష్మీ పథకం కింద లబ్ధిపొందేందుకు జిల్లాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కులము, నివాసం, ఆదాయ ధృవీకరణ పత్రాలను తీసుకోడానికి సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంటర్నెట్ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోడంతో మీసేవా కేంద్రాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి.

గ్రామీణ ప్రాంతాలనుంచి ఆన్ లైన్ సేవలకోసం మండలకేంద్రాలకు వచ్చి పడిగాపులు కాస్తున్నారు. ఈనెల 10 తేదీవరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంలో సకాలంలో ధృవీకరణ పత్రాలు అందక దరఖాస్తులను సమర్పించలేకపోతున్నారు. దీంతో దరఖాస్తుల సమర్పణకు గడువు పొడిగించాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories