వివాహంలో వెరైటీ మాస్కులు

వివాహంలో వెరైటీ మాస్కులు
x
Highlights

రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలను పాటిస్తూ అక్కడక్కడా వివాహాలు, రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలను పాటిస్తూ అక్కడక్కడా వివాహాలు, చిన్న చిన్న ఫంక్షల్లు జరుగుతూనే ఉన్నాయి.

రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలను పాటిస్తూ అక్కడక్కడా వివాహాలు, రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలను పాటిస్తూ అక్కడక్కడా వివాహాలు, చిన్న చిన్న ఫంక్షల్లు జరుగుతూనే ఉన్నాయి. అధికారుల నుంచి పర్మిషన్లు తీసుకుని శుభకార్యాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలో కూడా ఓ వివాహవేడుక జరిగింది. లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా తక్కువ మందితో ఈ పెళ్లిని జరిపించారు. అంతే కాదు ఈ వేడుకలను అన్ని పెళ్లివేడుకలలాగా కాకుండా కాస్త భిన్నంగా జరిపించారు పెళ్లి పెద్దలు.

అదేంటి అనుకుంటున్నారా ఈ వేడుకలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పూజారి సహా పెళ్లి హాజరైన అతిధులందరూ మాస్కులను ధరించారు. ఇది ప్రతి పెళ్లిలోనూ జరిగేదే కదా ఇందులో కొత్తేముందు అనుకోవచ్చు. కానీ కొత్త ఉందండీ పెళ్లిలో ప్రతి ఒక్కరు ధరించన మాస్కులపై వధువు, వరుడు ఫోటోలతో పాటు ''తుమ్మ వారి పెండ్లి సందడి. చి.ల.సౌ. సంధ్యారాణి వివాహము చి. చంద్రమౌళితో'' అని ముద్రించారు. అంతే కాదు స్టే హోం సేవ్ లైవ్స్, దూరం పాటించండి అంటూ కరోనా జాగ్రత్తలు కూడా మాస్కులపై ముద్రించారు. ఇంకేముందు ఆ మాస్కులపై ఓ చిన్నపాటి శుభలేఖతో పాటు, కరోనా జాగ్రత్తలు సూచించే పత్రం కూడా కనిపించింది. ఇంత చక్కగా రూపొందించిన మాస్కులను పెళ్లి పెద్దల ఆలోచనలను పలువురు అభినందిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories