D Srinivas: ఎమ్మెల్యేగా మొదలై రాజ్యసభ సభ్యుడిగా డీఎస్ ప్రయాణం ఎలా సాగిందంటే..?

Dharmapuri Srinivas Political Journey
x

D Srinivas: ఎమ్మెల్యేగా మొదలై రాజ్యసభ సభ్యుడిగా డీఎస్ ప్రయాణం ఎలా సాగిందంటే..?

Highlights

Dharmapuri Srinivas: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఇవాళ ఉదయం 3 గంటల 30 నిమిషాలకు గుండెపోటుతో మరణించారు.

Dharmapuri Srinivas: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఇవాళ ఉదయం 3 గంటల 30 నిమిషాలకు గుండెపోటుతో మరణించారు. కొద్దికాలంగా అస్వస్థతకు గురై ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందారు. అయితే ఇటీవల ఆయన ఆరోగ్యం మెరుగు పడడంతో హైదరాబాద్‌లోని ఇంట్లోనే రెస్టు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించారు. కాగా ఆ‍యన పార్థివదేహాన్ని ఇవాళ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఇంట్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. రేపు నిజామాబాద్‌లో ఆ‍యన అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు వెల్లడించారు.


1948 సెప్టెంబర్ 28న నిజామాబాద్ జిల్లా వేల్పూరులో జన్మించారు ధర్మపురి శ్రీనివాస్... నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన శ్రీనివాస్ కొద్దికాలం పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా చేశారు. అనంతర పరిణామాల క్రమంలో రాజకీయంపై మక్కువతో జక్రాన్‌పల్లికి చెందిన మాజీ మంత్రి అర్గుల్ రాజారాంతో సన్నిహితంగా ఉంటూ రాజకీయాల్లో చేరారు మొదటి సారి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన నిజామాబాదు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహించారు.

1989లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున నిజామాబాదు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి డి.సత్యనారాయణపై అత్యధిక మెజారిటీతో గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందాడు. చాలాకాలం పాటు సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రిగా, ఆ తర్వాత ఎక్సయిజ్ శాఖా మంత్రిగా పనిచేశారు. 1998లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించబడ్డారు.


1999లో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణను ఓడించి రెండోసారి నిజామాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అదే సమయంలో కాంగ్రెస్ శాసనసభ ఉప నాయకుడిగా పనిచేశారు. 2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రెండోసారి నియమించబడ్డారు. అప్పడు ఏపీ ఇంచార్జిగా ఉన్న వాయలార్ రవి ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఊతమిచ్చారు శ్రీనివాస్... 2004లో టీడీపీ అభ్యర్థి సతీష్ పవార్‌ను ఓడించి మూడో సారి శాసనసభకు ఎన్నికై వై.ఎస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.

2009 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచే పోటీ చేసి బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ చేతిలో పరాజయం పొందారు.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో బీజేపీ తరఫున విజయం సాధించిన లక్ష్మీనారాయణ రాజీనామా చేయడంతో... 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో డి.శ్రీనివాస్ మరోసారి లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోయారు.. 2014లో నిజామాబాదు రూరల్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓడిపోయారు.


2004, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు ధర్మపురి శ్రీనివాస్... 2015, జూలై 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. 2023 మార్చి 26న కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయనకు ఏఐసీసీ ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


ధర్మపురి శ్రీనివాస్‌కు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు సంజయ్, అర్వింద్ ఉన్నారు.. పెద్దకుమారుడు సంజయ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మొదటి మేయర్‌గా ఎన్నికయ్యారు. అర్వింద్ బీజేపీ తరఫున పోటీ చేసి రెండు సార్లు నిజామాబాద్ ఎంపీగా గెలుపొందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories