CM KCR Review Meet At Pragati Bhavan : ధరణి పోర్టల్‌ రూపకల్పనపై నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

CM KCR Review Meet At Pragati Bhavan : ధరణి పోర్టల్‌ రూపకల్పనపై నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
x
Highlights

CM KCR Review Meet At Pragati Bhavan : అన్నిరెవెన్యూ రికార్డులకు వన్ స్టాప్ సోర్స్ అయిన ధరణి పోర్టల్ సెప్టెంబర్ చివరి నాటికి కార్యరూపం దాల్చే అవకాశం...

CM KCR Review Meet At Pragati Bhavan : అన్నిరెవెన్యూ రికార్డులకు వన్ స్టాప్ సోర్స్ అయిన ధరణి పోర్టల్ సెప్టెంబర్ చివరి నాటికి కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. కాగా ధరణి పోర్టల్‌ రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ మంగళవారం మధ్యాహ్నం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం అమలు, విధివిధానాలపై అధికారులతో సీఎం సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. అంతే కాక పట్టణ, పురపాలక పన్నురికార్డులను అనుసంధానం చేసే అంశంపైనా చర్చించనున్నట్లు సమాచారం. రెవెన్యూశాఖకు సంబంధించి ధరణి పోర్టల్‌ను కొత్తగా రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది.

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణల్లో భాగంగా అన్ని రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించే విధంగా ఈ పోర్టల్‌ను రూపొందించాలని సీఎం కోరుతున్నారు. నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న నేపథ్యంలో పోర్టల్‌లో ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేస్తోంది. ఈ పోర్టల్ ద్వారా రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ విభాగాల పనితీరులో 100 శాతం పారదర్శకత, అవినీతి రహితంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల నమోదు జరుగుతుంది. ధరణి పోర్టల్ సక్రియం అయ్యేవరకు భూమి, ఇతర ఆస్తి రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం ఇప్పటికే నిలిపివేసిందని. ఇక ఈ సమావేశంలో పోర్టల్ ప్రారంభించే తేదీని ముఖ్యమంత్రి ఖరారు చేస్తారని అధికారులు తెలిపారు. భూదస్త్రాల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టడంతో సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories