DGP Mahender Reddy: మావోయిస్టు రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం

DGP Mahender Reddy Review Meeting On Mulugu | TS News
x

DGP Mahender Reddy: మావోయిస్టు రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం

Highlights

*ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల అధికారులతో DGP సమీక్ష

DGP Mahender Reddy: తెలంగాణాను మావోయిస్టు రహిత రాష్ట్రంగా చేయడమే పోలీసుల లక్ష్యమని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఇందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులు ప్రణాళికాబద్దంగా పనిచేయాలని సూచించారు. ములుగు జిల్లాలో పర్యటించిన డీజీపీ మహేందర్‎రెడ్డి ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం నాలుగు జిల్లాల పోలీస్ అధికారులతో మావోయిస్టు నివారణ చర్యల ప్రభావంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు వెలుగుచూస్తున్న తరుణంలో వాటిని అడ్డుకోవడానికి పోలీసులు చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే మావోయిస్టులు వారి సానుభూతిపరులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సూచించారు. లొంగిపోయిన ప్రతివారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంచి సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories