వైభవంగా పెన్‌'గంగ' జాతర

వైభవంగా పెన్‌గంగ జాతర
x

వైభవంగా పెన్‌'గంగ' జాతర

Highlights

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని పెన్ గంగా నదీ తీరంలో జాతర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతీ సంవత్సరం పుష్యమాసంలో నిర్వహించే ఈ ఉత్సవాలకు రెండు...

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని పెన్ గంగా నదీ తీరంలో జాతర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతీ సంవత్సరం పుష్యమాసంలో నిర్వహించే ఈ ఉత్సవాలకు రెండు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివస్తారు. అయితే కోవిడ్ కారణంగా ఈ ఏడాది జాతరకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించక పోవడంతో కేవలం మొక్కులు తీర్చుకొనేందుకు వస్తున్నారు భక్తులు.

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం డొల్లారా వద్ద మహారాష్ట్ర సరిహద్దులో వైభవంగా పెన్‌'గంగ' జాతర జరుగుతుంది. ప్రతీ ఏటా పుష్యమాసంలో జరిగే ఈ జాతరలో మహారాష్ట్ర, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తారు. నదీమా తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటారు.

పెన్ గంగా సమీపంలో శివలింగం, రామానంద తీర్థ, మాధవ మహరాజ్ సమాధులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులందరూ పెన్ గంగలో స్నానాలు చేసి శివలింగంతో పాటు సమాధులను దర్శనం చేసుకొని పూజలు నిర్వహిస్తారు.

పెరుగు అన్నం, తియ్యటి పరమాన్నం, అప్పం-గారెలతో నైవేద్యాలు తయారు చేస్తారు. నది పారే చోట చిన్నచిన్న రాళ్లకు పూజలు చేసి, పిండి వంటలను తెప్పలో ఉంఛి గంగలో వదిలేస్తుంటారు. ఇలా చేస్తే పాపాలు పోవడంతోపాటు రోగాలు నయమౌతాయని భక్తుల నమ్మకం.

ఐదు రోజులపాటు కొనసాగే జాతరకు మహారాష్ట్రతో పాటు ఆదిలాబాద్​ జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ సారి కోవిడ్ కారణంగా పెన్ గంగా జాతరకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించక పోవడంతో కేవలం మొక్కులు తీర్చుకొనేందుకు భక్తులు వస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories