Medaram: మేడారం మహాజాతరకు పోటెత్తిన భక్తులు

Devotees flock to Medaram Maha Jatara
x

Medaram: మేడారం మహాజాతరకు పోటెత్తిన భక్తులు

Highlights

Medaram: ప్రైవేట్‌ వాహనాలు, ఫోర్‌ వీలర్లతో జాతరకు భక్తజనం

Medaram: మేడారం మ‌హాజాత‌ర‌కు భ‌క్తులు పోటెత్తారు. రెడ్డిగూడెం నుంచి జంప‌న్న వాగుకు చేరుకునేందుకు కాలిన‌డ‌క‌న బ‌య‌ల్దేరిన భ‌క్తుల‌కు అడుగ‌డుగునా ఇబ్బందులు త‌ప్పడం లేదు. ప్రైవేట్ వాహ‌నాలు, ఫోర్ వీల‌ర్లు దారుల్లోకి ప్రవేశించ‌డంతో భ‌క్తులు న‌డ‌వ‌డానికి కూడా వీల్లేకుండా పోయింది. రెడ్డిగూడెం హనుమాన్ ఆల‌యం నుంచి జంప‌న్న వాగుకు చేరుకోవ‌డానికి కాలిన‌డ‌క‌న గంట‌కు పైగా స‌మ‌యం ప‌ట్టడంతో భ‌క్తులు అస‌హ‌నం వ్యక్తం చేశారు. చిన్నారులు, వృద్ధులు, శివ‌స‌త్తులు గంట‌ల త‌ర‌బ‌డి రోడ్లపై వేచి ఉండాల్సి వ‌చ్చింది.

వాస్తవానికి ఈ రూట్లలో ప్రైవేటు ద్విచ‌క్రవాహ‌నాలు, ఫోర్ వీల‌ర్లకు ఎలాంటి అనుమ‌తి లేదు.అయితే కొంత‌మంది పోలీసు అధికారులు, ఇత‌ర శాఖ‌ల అధికారుల కుటుంబాల స‌భ్యుల‌ను, బంధు, మిత్రుల వాహ‌నాల‌ను అనుమ‌తివ్వడం ట్రాఫిక్ జాంకు ప్రధాన కార‌ణ‌మ‌వుతోంది.కొంత‌మంది వాహ‌నదారులు న‌కిలీ వీఐపీ, వెహికిల్‌ క‌ల‌ర్‌ జిరాక్స్‌ల‌ను పాస్‌లు చూపుతూ ద‌ర్శనాల‌కు వెళ్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories