Bhatti Vikramarka: తెలంగాణలో విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది

Deputy CM Bhatti Vikramarka Speech in Assembly
x

Bhatti Vikramarka: తెలంగాణలో విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది

Highlights

Bhatti Vikramarka: విద్యుత్ సంస్థలను గత ప్రభుత్వం గాలికొదిలేసింది

Bhatti Vikramarka: తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్‌ రంగంపై ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. 30 పేజీలతో కూడిన శ్వేతపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణలో విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యుత్ సంస్థలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. విద్యుత్ రంగంపై మొత్తం 81 వేల 516 కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు భట్టి తెలిపారు. డిస్కంలన్నీ అప్పుల ఊబిలో కూరుకుపోయాయని అన్నారు. గత ప్రభుత్వం దూర దృష్టితో వ్యవహరించకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందంటూ భట్టి ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories