Mallu Bhatti Vikramarka: విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష

Deputy CM Bhatti review with power department
x

Mallu Bhatti Vikramarka: విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష

Highlights

Mallu Bhatti Vikramarka: సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

Mallu Bhatti Vikramarka: విద్యుదుత్పత్తి విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సాంకేతిక సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ వేయాలని ఆదేశించారు. ప్రజాభవన్‌లో ట్రాన్స్ కో, జెన్ కోలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష జరిపారు డిప్యూటీ సీఎం భట్టి. జల విద్యుత్ కేంద్రాల్లో సాంకేతిక స‌మ‌స్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. డిసెంబ‌ర్ 2023కు ముందు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలుకు సంబంధించి తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారుల‌కు ఆదేశించారు భ‌ట్టి విక్రమార్క. గృహజ్యోతి పథకం అమలుపై ఆరా తీసిన ఆయన.. అర్హులై ఉండి గతంలో దరఖాస్తు చేసుకోని వారికి తిరిగి అవకాశం కల్పించాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories