నిర్లక్ష్యంగా ఫ్రీ కోచింగ్‌.. ఒకటి రెండు రోజులు మొక్కుబడిగా తరగతులు...

Demand for Free Coaching Classes in Telangana Universities
x

నిర్లక్ష్యంగా ఫ్రీ కోచింగ్‌.. ఒకటి రెండు రోజులు మొక్కుబడిగా తరగతులు...

Highlights

Telangana: యూనివర్శిటీల్లో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు

Telangana: తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. యూనివర్సిటీల్లో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు విన్పిస్తున్నాయి. యూనివర్సిటిల్లో రాష్ట్ర సర్కార్ ఫ్రీ కోచింగ్‌ను స్టార్ట్ చేసినా ఇంకా పూర్తి స్థాయిలో తరగతులు మొదలు కాలేదు. గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలై రెండు వారాలు గడస్తున్నా యూనివర్సిటీల్లో క్లాసులను మొదలు పెట్టలేదు. క్లాసులు మొదలు పెట్టిన యూనివర్సిటిల్లోనూ ఒకటి రెండు రోజులు మొక్కుబడిగా తరగతులు నిర్వహిస్తున్నారు. యూనివర్సిటిల్లోని అభ్యర్ధుల ఇబ్బందులపై హెచ్ ఎంటివి స్పెషల్ ఫోకస్.

పేద అభ్యర్థులు పోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 20న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి యూనివర్సిటీల్లో ఫ్రీ కోచింగ్‌ను ప్రారంభించారు. ఉస్మానియా, పాలమూరు యూనివర్సిటీల్లో తప్ప ఎక్కడా పూర్తి స్థాయిలో క్లాసులు జరగట్లేదు. సెమిస్టర్ ఎగ్జామ్స్, వేసవి సెలవుల పేరుతో యూనివర్సిటీల్లో క్లాసులను నిలిపివేశారు. శాతవాహన వర్సిటీలో కేవలం వారంలో రెండు రోజులే క్లాసులు నిర్వహిస్తున్నారు. కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ వర్సిటీల్లో క్లాసులు మొదలవ్వనే లేదు. అసలు క్లాసులు పెట్టడం లేదని, ఒకవేళ పెట్టినా ఒకట్రెండు రోజులే నిర్వహిస్తుండటంతో సిలబస్ ఎలా పూర్తి చేస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

యూనివర్సిటీల్లో ఉచిత కోచింగ్ క్లాసులకు భారీ డిమాండ్ పెరిగింది. ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు వస్తుండడంతో విద్యార్థులంతా ప్రిపేర్ అవుతున్నారు. కొందరు అభ్యర్ధులు పీజీ పూర్తయినా ప్రిపరేషన్ కోసమే మరో పీజీకి అడ్మిషన్ తీసుకుంటున్నారు. వర్సిటీ ప్రొఫెసర్లే సబ్జెక్టులను బోధిస్తుండడంతో కోచింగ్‌కు వెళ్లేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓయూలో క్లాస్ రూమ్ మొత్తం నిండిపోవడంతో ప్రత్యేకంగా ఇంకో సెక్షన్నే ఓపెన్ చేశారు. అయితే, చాలా యూనివర్సిటీలు మాత్రం వేసవి సెలవుల పేరు చెప్పి హాస్టళ్లను మూసేశాయి. నిజామాబాద్‌లోని తెలంగాణ వర్సిటీకి ఈ నెల 10 నుంచి సమ్మర్ హాలీడేస్ ఇవ్వడంతో స్టూడెంట్లు ఇంటిబాట పట్టారు.

యూనివర్శిటీల్లో ఫ్రీ కోచింగ్ నిర్వహణ సరిగా లేకపోవడంతో అభ్యర‌్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్ళుగా ఎదురు చూస్తున్న జాబుల జాతర మొదలవడంతో పోటీ పరీక్షల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్ధితుల నేపథ్యంలో ప్రైవేట్ కొచింగ్ సెంటర్లు ఇష్టారాజ్యంగా దొపిడీ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories