Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌... మరో చార్జిషీట్‌లోనూ ఎమ్మెల్సీ కవిత పేరు

Delhi liquor scam Kavitha Name Surfaced Another Charge Sheet
x

Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌... మరో చార్జిషీట్‌లోనూ ఎమ్మెల్సీ కవిత పేరు

Highlights

Delhi liquor Scam: సమీర్ మహేంద్రు కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ

Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు తెర పైకి వచ్చింది. సమీర్ మహేంద్రు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీటు దాఖలు చేసింది. ఛార్జ్‌ షీటులో ఎమ్మెల్సీ కవిత పేరు పేర్కొనడం హాట్ టాపిక్‌గా మారింది. కవితతో పాటు మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, ముత్తా గౌతమ్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, అభిషేక్ రావు పేర్లను ఈడీ పేర్కొంది.

ఒబేరాయ్ హోటల్‌లో సమావేశం జరిగినట్లు ఈడీ ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. అనంతరం శరత్ చంద్రాడ్డి సొంత ఫ్లైట్‌లో హైదరాబాద్ వెళ్లినట్లు ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్స్‌లో ఎల్-1 కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని ఈడీ వెల్లడించింది. ఒబేరాయ్ హోటల్‌లో జరిగిన మీటింగ్‌లో కవిత, అరుణ్ పిళ్లై, దినేష్ అరోరా, విజయ్ నాయర్ పాల్గొన్నట్లు ఛార్జీషీట్‌లో ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్స్ ను కవిత వెనకుండి నడిపించారని తెలిపింది. ఇండో స్పిరిట్స్‌లో నిజమైన భాగస్వామలు కవిత, మాగుంట శ్రీనివాస్ రెడ్డి అని ఛార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది.

సౌత్ గ్రూప్ పేరిట రూ.192 కోట్ల లిక్కర్ దందా జరిగిందని, 2022 జనవరిలో హైదరాబాద్‌లో ఆమె నివాసంలో కవితను సమీర్ మహేంద్రు కలిశారని ఈడీ తెలిపింది. ఇండో స్పిరిట్స్ కంపెనీ నిర్వహణపై కవితతో సమీర్ మహేంద్రు చర్చించారని, సమీర్ మహేంద్రుకు అరుణ్ పిళ్ళై తన ప్రతినిధి అని కవిత చెప్పినట్టు చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది.కవిత వాడి ధ్వంసం చేసిన పది ఫోన్ల వివరాలను సమీర్ మహేంద్రు ఛార్జ్‌షీటులో ఈడీ పేర్కొంది.

ఇండో స్పిరిట్స్‌కి 192కోట్ల 8 లక్షల లాభం వచ్చినట్టు చార్జ్‌షీట్‌లో ఈడీ వెల్లడించింది. 192 కోట్లు అక్రమంగా వచ్చినట్టు పేర్కొన్న ఈడీ ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి ఆప్ నేతలతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడిందని తెలిపింది. ఆ తర్వాతే ఇండో స్పిరిట్స్లో కవిత వాటాలు తీసుకుందని, ఇండో స్పిరిట్స్లో వాటా తీసుకునేందుకు కవిత తరపు వ్యక్తి వి.శ్రీనివాస్రావు ముందుకు వచ్చారని ఈడీ పేర్కొంది. రూ.కోటి పెట్టినట్లు అరుణ్ పిళ్ళై నవంబర్ 11న ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్‌లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇండో స్పిరిట్స్లో సమీర్ మహేంద్రు వాటా 35 శాతం, బుచ్చిబాబు 16.25 శాతం, అరుణ్ పిళ్లైకి 16.25 శాతం, ప్రేమ్ రాహుల్ మందురీకి 32.5 శాతం వాటా ఉందని ఈడీ స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories