Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవిత లేఖకు సమాధానమిచ్చిన సీబీఐ..

Delhi Liquor Scam CBI to Question K Kavitha on Dec 11
x

Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవిత లేఖకు సమాధానమిచ్చిన సీబీఐ..

Highlights

Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవిత లేఖకు సీబీఐ అధికారులు రిప్లయ్ ఇచ్చారు.

Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవిత లేఖకు సీబీఐ అధికారులు రిప్లయ్ ఇచ్చారు. ఈ నెల 11న కవితతో భేటీకి సీబీఐ అంగీకారం తెలిపింది. వివరణ కోసం ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటానంటూ నిన్న కవిత లేఖ రాశారు. దీనిపై స్పందించిన సీబీఐ 11న సమావేశానికి సుముఖత తెలిపారు. ఈ-మెయిల్‌ ద్వారా కవితకు సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు. ఉదయం 11 గంటలకు భేటీ అవుతామని స్పష్టం చేశారు సీబీఐ అధికారులు.

అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉందని సీబీఐ తెలిపింది. దీంతో ముందు సీబీఐ నోటీసులతో ఇవాళ భేటీకి టైమ్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. అయితే ఆ తర్వాత ఎఫ్ ఐఆర్ కాపీ వివరాలు కోరగా నెట్ లో వివరాలు చూసుకోవాలని కవితకు సీబీఐ సూచించింది. అనంతరం ఎఫ్ ఐఆర్ లో తన పేరు లేదని సీబీఐకి కవిత మరో లేఖ రాశారు. పేరు లేకపోయినా విచారణకు సహకరిస్తానని లేఖలో వెల్లడించారు. విచారణకు నాలుగు తేదీలు సూచిస్తూ లేఖ రాశారు. దీంతో ఈ నెల 11న ఉదయం 11 గంటలకు విచారిస్తామని కవిత లేఖకు సీబీఐ అధికారులు రిప్లయ్ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories