ప్రేమ వద్దన్నందుకు సుపారీ ఇచ్చి మరీ తండ్రిని హత్య చేయించిన మైనర్ బాలిక

Daughter Kills her Father in Kushaiguda
x

ప్రేమ వద్దన్నందుకు సుపారీ ఇచ్చి మరీ తండ్రిని హత్య చేయించిన మైనర్ బాలిక

Highlights

Kushaiguda: హైదరాబాద్‌ కుషాయిగూడలో దారుణం చోటుచేసుకుంది.

Kushaiguda: హైదరాబాద్‌ కుషాయిగూడలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమను అంగీకరించని తండ్రిని సుపారీ ఇచ్చి మరీ కూతురు చంపించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తండ్రి తినే ఆహారంలో మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయేలా చేసిన ఆ మైనర్‌ బాలిక ఆ తర్వాత ప్రియుడిని పిలిపించి సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించింది. కిందపడి చనిపోయినట్టు కథ అల్లి ఇంట్లో వాళ్లను నమ్మించింది. అయితే పోస్టుమార్టం రిపోర్టులో హత్యకు గురైనట్టు తెలియడంతో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మైనర్‌ బాలికతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories