Telangana: ముగిసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ.. 17 వరకు దరఖాస్తుల డేటా ఎంట్రీ

Data Entry of Applications from Tomorrow to 17th of this Month
x

Telangana: ముగిసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ.. 17 వరకు దరఖాస్తుల డేటా ఎంట్రీ

Highlights

Telangana: 6 గ్యారెంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ

Telangana: తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది. 6 గ్యారెంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ నిన్నటితో ముగిసింది. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా.. గత నెల 28 నుంచి నిన్నటి వరకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు అధికారులు. అభయహస్తం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా కోటి 25 లక్షల 84 వేల దరఖాస్తులు వచ్చినట్టు చెప్పారు. ప్రజాపాలనలో గృహలక్ష్మి, పెన్షన్లు, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్టు స్పష్టం చేశారు.

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మొత్తం 24 లక్షల 75 వేల 3 వందల 25 దరఖాస్తులు స్వీకరించినట్టు అధికారులు చెప్పారు. అభయహస్తం కోసం 19 లక్షల 12 వందల 56 దరఖాస్తులు, ఇతర సేవల కోసం 5 లక్షల 73 వేల 69 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. ఇక.. రేపటి నుంచి ఈ నెల 17 వరకు దరఖాస్తుల డేటా ఎంట్రీ కార్యక్రమం చేపడతామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories