Dussehra Holidays 2024: దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే?

Dasara Holidays Will Begin on October 02 and Continue Till October 14 for Telangana Schools Colleges
x

Dussehra Holidays 2024: దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే?

Highlights

అక్టోబర్ 2వ తేదీ నుంచి 14 వరకు స్కూళ్లకు దసరా సెలవులు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Dussehra Holidays 2024: తెలంగాణలో అన్ని పండగల్లో అత్యంత ముఖ్యమైన పండగ దసరా. ఈ పండగకు ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సొంతూళ్లకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి దసరాను జరుపుకుంటారు. దసరాతో పాటు బతుకమ్మను అంతే ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ముందుగానే సెలవు ప్రకటిస్తుంది. తాజాగా.. దసరా పండుగ సమీపిస్తోన్న నేపథ్యంలో విద్యాసంస్థలకు విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు.

అక్టోబర్ 2వ తేదీ నుంచి 14 వరకు స్కూళ్లకు దసరా సెలవులు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 12న దసరా పండుగ ఉంది. 15వ తేదీ నుంచి యథావిధిగా పాఠశాలలు తెరుచుకుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. కొన్ని ప్రైయివేటు పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. మళ్లీ అక్టోబర్ 15వ పునః ప్రారంభం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం కూడా అందినట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా ఈ ఏడాది విద్యాసంస్థలకు 13 రోజుల పాటు దసరా పండగ సెలవులు రానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories