Jani Master: జానీ మాస్టర్‌ అరెస్టుపై పోలీసుల అధికారిక ప్రకటన

Cyberabad Police Issued a Statement on the Arrest of Jani Master
x

Jani Master: జానీ మాస్టర్‌ అరెస్టుపై పోలీసుల అధికారిక ప్రకటన

Highlights

Jani Master: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌ అరెస్టుపై పోలీసులు అధికారిక ప్రకటన చేశారు.

Jani Master: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌ అరెస్టుపై పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. గోవాలో జానీ మాస్టర్‌ను అరెస్టు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. హైదరాబాద్‌ తీసుకొచ్చిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారాయన.

కేసు విషయానికొస్తే..ఈనెల 15వ తేదీన బాధితురాలి ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ పై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. జానీ బాషాపై 376(2)n, 506, 323 ఐపీసీ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. 2020లో ముంబైలో పనిచేస్తున్నప్పుడు జానీ బాషా తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు కంప్లైంట్ చేసిందన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలాన్ని సేకరించామన్న డీసీపీ శ్రీనివాస్‌ నేరం జరిగినప్పుడు బాధిత మహిళ మైనర్ అని తేలడంతో..పోక్సో చట్టం 2012, 5(I)r/w 6 సెక్షన్ జోడించినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories