సినిమా ఛేజింగ్ తరహా అనుభవం ఎదుర్కొన్న సైబరాబాద్ పోలీసులు

సినిమా ఛేజింగ్ తరహా అనుభవం ఎదుర్కొన్న సైబరాబాద్ పోలీసులు
x
Highlights

సినిమా సన్నివేశాలు తలపించేలా పోలీసులపై దుండగులు తిరగబడే అనుభవం మన సైబరాబాద్ పోలీసులకు ఎదురైంది. వాహనాలకు అడ్డు పడి, రాళ్లు రువ్వి, కళ్లల్లో కారం చల్లి...

సినిమా సన్నివేశాలు తలపించేలా పోలీసులపై దుండగులు తిరగబడే అనుభవం మన సైబరాబాద్ పోలీసులకు ఎదురైంది. వాహనాలకు అడ్డు పడి, రాళ్లు రువ్వి, కళ్లల్లో కారం చల్లి తప్పించుకునే ప్రయత్నం చేసిన దుండగుల్ని ఎలా మన పోలీసులు పట్టుకున్నారు..? అసలెక్కడ ఈ అడ్వంచర్ ఆపరేషన్ జరిగింది..?

సినిమా తరహా ఛేజింగ్ అనుభవాలు మ‌న సైబ‌రాబాద్ పోలీసుల‌కు ఎదురైంది. రాజ‌స్థాన్ భ‌ర‌త్ పూర్, పులేరా గ్రామాల్లోని యువ‌కులు సైబ‌ర్ నేరాల్లో సిద్ధ‌హ‌స్తులు. సగం ధరలకే కార్లు, బైకులు ఇస్తామంటూ హైదరాబాద్ లో మోసాలకు పాల్పడ్డారు. ఆ ముఠాను పట్టుకునేందుకు రాజస్థాన్ వెళ్లారు మన సైబరాబాద్ పోలీసులు.

ఇలా వెళ్లి అలా నేరస్థుల్ని పట్టుకొచ్చేస్తామని వెళ్లిన పోలీసులకు చుక్కలు చూపించారు అక్కడి ముఠా సభ్యులు. ఒక్కసారిగా వారంత పోలీసులపై తిరగబడ్డారు. వాహనాలను అడ్డుకుని ధ్వంసం చేసి, రాళ్లు రువ్వి, కళ్లల్లో కారం కొట్టారు. ఊహించని ఈ పరిణామంతో అవాక్కయ్యారు పోలీసులు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు భరత్ పూర్ ఎస్పీతో మాట్లాడి వారి సహాయం కోరారు.

రంగంలోకి వందమంది స్థానిక పోలీసులతో పాటు సాయుధ బలగాలు దిగాయి. యథావిధిగా వారిపై కూడా నేరస్థులు దాడి చేయగా, భాష్పవాయువు ప్రయోగించి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం మన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఏదేమైనా ఊహించ‌ని చేదు అనుభ‌వల్ని మన సైబరాబాద్ పోలీసులు ఎదుర్కొన్నారు. సినిమాను మించిన ఛేజింగ్ చేసి, ఫైన‌ల్ గా నిందితుల‌ను ప‌ట్టుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories