Cyberabad: సైబరాబాద్‌ పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్‌ వేటు

Cyberabad CP Avinash Mahanthi Suspends Two Inspector
x

Cyberabad: సైబరాబాద్‌ పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్‌ వేటు

Highlights

Cyberabad: కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌, ఆర్జీఐ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు సస్పెండ్‌

Cyberabad: సైబరాబాద్‌ పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్‌ వేటు పడింది. కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌, ఆర్జీఐ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులును సస్పెండ్‌ చేస్తూ.. సీపీ అవినాష్‌ మహంతి ఆదేశాలు జారీ చేశారు. కేపీహెచ్‌బీలో ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినందుకు ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌పై వేటు పడింది. దంపతుల వివాదంలో జోక్యం చేసుకుని వ్యక్తిని చితకబాదినట్టు ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడిని సస్పెండ్‌ చేశారు సీపీ మహంతి. అలాగే.. ఆర్జీఐ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులును కూడా సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories