రోజు రోజుకు రెచ్చిపోతున్న ఘరానా మోసగాళ్లు.. ఏసీబీ అధికారులమంటూ బెదిరింపు కాల్స్...

Cyber Frauds Fake Calls and Blackmailing MRO Officers by Saying ACB Officers | Live News
x

రోజు రోజుకు రెచ్చిపోతున్న ఘరానా మోసగాళ్లు.. ఏసీబీ అధికారులమంటూ బెదిరింపు కాల్స్...

Highlights

TS News: ఫోన్‌కాల్స్ అన్నీ నకిలీవేనని గుర్తించిన జగిత్యాల జిల్లా కలెక్టర్...

TS News: తెలంగాణలో మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏసీబీ అధికారులమంటూ ఏకంగా ఎమ్మార్వోలకే ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారు. మేము ఏసీబీ అధికారులం...నీమీద అవినీతి ఆరోపణలు లొచ్చాయి. కేసు కాకుండా ఉండాలంటూ అందుకు భారీ మొత్తంలో సమర్పించుకోవాలంటూ కేటుగాళ్లు బెదిరించిన ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

జగిత్యాల జిల్లాలోని పలువురు ఎమ్మార్వోలకు ఏసీబీ అధికారులమంటూ ఫోన్‌కాల్స్ రావడంతో అధికారులు హడలెత్తిపోయారు. అయితే ఫేక్‌కాల్స్‌పై జగిత్యాల జిల్లా కలెక్టర్‌ రవి నాయక్ ఆరా తీయగా బెంగళూరు నుంచి కాల్స్ వచ్చినట్లు నిర్థారించారు. ఇదే విషయంపై జగిత్యాల జిల్లా తహశీల్దార్లతో కలెక్టర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories