Teenmar Mallanna: తీన్మార్‌ మల్లన్న ఆఫీస్‌లో సైబర్‌ క్రైం పోలీసుల తనిఖీ

Cyber Crime Police Chekings in Teenmar Mallanna Office
x
తీన్మార్ మల్లన్న ఆఫీసులో తనిఖీలు నిర్వహించిన పోలీసులు (ఫైల్ ఇమేజ్)
Highlights

Teenmar Mallanna: క్యూన్యూస్‌ ఆఫీస్‌లో అర్థగంట పాటు సోదాలు * హార్డ్‌ డిస్క్‌, పెన్‌డ్రైవ్‌, కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు

Teenmar Mallanna: తీన్మార్‌ మల్లన్న ఆఫీస్‌లో నిన్న రాత్రి సైబర్‌ క్రైం పోలీసులు తనిఖీలు చేపట్టారు. మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలోని క్యూన్యూస్‌ ఆఫీస్‌లో సైబర్‌ క్రైం పోలీసులు అరగంట పాటు సోదాలు చేశారు. హార్డ్‌ డిస్క్‌, పెన్‌డ్రైవ్‌, కంప్యూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీన్మార్‌ మల్లన్న వద్ద పనిచేసి మానేసిన ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. తీన్మార్‌ మల్లన్నతో పాటు అతని సోదరుడు తన వ్యక్తిగత సమాచారం సేకరించి, బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరి సమాచారం, ఎందుకు సేకరించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తనిఖీల సమాచారం తెలుసుకున్న మల్లన్న అభిమానులు ఆఫీస్‌ వద్దకు భారీగా చేరుకున్నారు. మల్లన్న కార్యాలయం నుంచి పోలీసులు కంప్యూటర్‌ను తీసుకువెళ్తుండగా ఆయన అనుచరులు పోలీసులను అడ్డుకున్నారు. మల్లన్నకు నోటీసులు ఇచ్చేందుకే వచ్చామని పోలీసులు వెల్లడించారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపైకి చేరిన మల్లన్న అభిమానులు ఆందోళన చేపట్టారు.


Show Full Article
Print Article
Next Story
More Stories