CS Shanti Kumari: జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్

CS Shanti Kumari Video Conference With District Collectors
x

CS Shanti Kumari: జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్

Highlights

CS Shanti Kumari: సంక్షేమ పథకాలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష

CS Shanti Kumari: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాల పురోగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సీఎం ఆదేశాలతో నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు వివిధ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు, తెలంగాణాకు హరితహారం, దశాబ్ది సంపద వనాలు, గొర్రెల పంపిణి, బీసీ, మైనారిటీలకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం, గృహలక్ష్మి, దళిత బంధు, భూ పట్టాల పంపిణీ, సామాజిక భద్రతా పింఛనులు, కారుణ్య నియామకాలు, నోటరీ భూముల క్రమబద్దీకరణతో పాటు పలు అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఇటీవల చేపట్టిన కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో లక్ష్యానికి మించి మొక్కలను నాటడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జిల్లా కలెక్టర్లను అభినందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories