CS Shanti Kumari: వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష

CS Shanti Kumari review with senior officials of various welfare departments
x

CS Shanti Kumari: వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష

Highlights

CS Shanti Kumari: ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం భూములు గుర్తించాలి

CS Shanti Kumari: తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు కోసం భూములు గుర్తించాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. మౌలిక సదుపాయాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షించారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాలు, విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం, తల్లిదండ్రులు పిల్లలను కలిసేందుకు ప్రత్యేక గది మొదలైనవి ఉండేలా భవనాన్ని డిజైన్ చేసి వారంలోగా సిద్ధం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.

పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ సలహాదారుతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ శాఖ ఈ ప్రాజెక్టుకి నోడల్ ఆఫీసర్‌గా ఇతర సంక్షేమ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. 49 రెసెడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని... అందులో ఎనిమిది పాఠశాలలు ఈ ఏడాది గ్రౌండింగ్‌కు సిద్ధంగా ఉన్నాయని అధికారులు సీఎస్‌కి తెలిపారు. 31 రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు భూమిని గుర్తించగా... మిగిలిన 10 పాఠశాలలకు సంబంధించి భూమి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories