తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

CS Review Of Telangana State Formation Day Arrangements
x

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

Highlights

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నట్టుగా ఆమె చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు.

పరేడ్ గ్రౌండ్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్ల పై అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాలను కేటాయించేటప్పుడు ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు చేపట్టాలని పోలీసు శాఖను ఆదేశించారు.

సభా ప్రాంగణం పరిసర పారంతాలలో పారిశుద్య పనుల నిర్వహణ తోపాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, రోడ్డుకు ఇరువైపులా రంగురంగుల జెండాలను అలంకరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను కోరారు. నిరంతరాయంగా త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేయాలని విధ్యుత్ శాఖకు సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు.ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, ముఖ్య కార్యదర్శులు బి వెంకటేశం, జితేందర్, కార్యదర్శులు క్రిస్టినా జోంగ్తు, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి, టీఎస్‌పీడీసీఎల్ ఎండీ ముషారఫ్, సీడీఎంఏ దివ్య, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories