తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే తగ్గిన క్రైం రేట్

తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే తగ్గిన క్రైం రేట్
x
Highlights

తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే క్రైమ్ రేట్ తగ్గింది. కరోనా కష్ట కాలంలో పోలీసులు ముందుండి డ్యూటీలు నిర్వహించారని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు....

తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే క్రైమ్ రేట్ తగ్గింది. కరోనా కష్ట కాలంలో పోలీసులు ముందుండి డ్యూటీలు నిర్వహించారని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. 2020 సంవత్సరానికి గాను వార్షిక క్రైం నివేదికను డీజీపీ మహేందర్ రెడ్డి విడుదల చేశారు. మహిళలు, పిల్లల భద్రతకు పోలీసు శాఖ పెద్ద పీట వేశామని డీజీపీ చెప్పారు. గడిచిన సంవత్సర కాలంలో జరిగిన చోరీల్లో 54 శాతం రికవరీ చేశామన్నారు. మహిళలపై వేధింపులు 1.9 శాతం తగ్గు ముఖం పట్టాయని వెల్లడించారు. మర్డర్స్, దోపిడీలు, రాబరీ చైన్ స్నాచింగ్, రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గినట్లు డీజీపీ తెలిపారు.

2020 లో రాష్ట్ర వ్యాప్తంగా 11 ఎన్ కౌంటర్లు జరగగా 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. 136 మంది మావోలను అరెస్ట్ చేశారు. ఏకే 47 గన్ తో పాటు , మొత్తం 22 ఆయుధాలు,3 ల్యాండ్ మైన్స్ , 23 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో మూడు జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉందని కేంద్ర కమిటీ ఆదేశాలతో తెలంగాణలోకి చొరబడే ప్రయత్నాన్ని భద్రతా బలగాలు తిప్పికొట్టాయని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.

తెలంగాణ వ్యాప్తంగా కరోణ కారణంగా సైబర్ క్రైమ్ కేసులు గణనీయంగా పెరిగాయి. రాష్ర్ట వ్యాప్తంగా 4 వేల 544 కేసులు నమోదయ్యాయి. 9 వేల568 ఆర్ధిక నేరాల కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది 350 పీడీ యాక్ట్ లు పెట్టారు. షీ టీమ్స్ కి 4855 కంప్లైంట్స్ రాగా 567 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులో 93 కోట్ల 73 లక్షలు ప్రాపర్టీ లాస్ అయితే 50 కోట్ల 47 లక్షలు రికవరీ చేశామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories