CPM: నేడు సీపీఎం జాబితా విడుదల

CPM Telangana Candidate List Release
x

CPM: నేడు సీపీఎం జాబితా విడుదల

Highlights

CPM: 15 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేయనున్న సీపీఎం

CPM: కాంగ్రెస్‌తో కటీఫ్ చేసుకున్న సీపీఎం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్దమయ్యింది. ఇందులో భాగంగా.. ఉదయం 9 గంటలకు సీపీఎం కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. 15 మంది అభ్యర్థులతో సీపీఎం లిస్ట్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. జాబితాతో పాటు మేనిఫెస్టోను కూడా ప్రకటించనుంది సీపీఎం.

అటు కాంగ్రెస్‌తో సీపీఐ పార్టీ పొత్తు కుదుర్చుకుని ఒక ఎమ్మెల్యే స్థానంలో పోటీకి అవకాశం కల్పించడంతో పాటు అధికారంలోకి వస్తే మరో శాసనమండలికి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ చెప్పడంతో అందుకు సీపీఐ తమ అంగీకారం తెలిపింది. అయితే సీపీఎం మాత్రం తాము కోరిన సీట్లు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్‌తో పట్టుబట్టడంతో సయోధ్య కుదరలేదని చెబుతున్నారు.

భద్రాచలం, మధిర అడిగితే సిట్టింగ్ స్థానాలు ఇవ్వలేమంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పారని సీపీఎం చెబుతోంది. అయితే తమ ప్రతిపాదనల పట్ల కాంగ్రెస్ స్పందించక పోవడంతో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. కాగా రాష్ట్రంలో తమకు బలం ఉన్న 24 సీట్లలో పోటీ చేయాలని తమ పార్టీ అభ్యర్థుల నుండి ప్రతిపాదనలు వచ్చాయని, ఈ క్రమంలో మొదటి విడతలో 17 స్థానాలను ప్రకటిస్తామన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.

Show Full Article
Print Article
Next Story
More Stories