CP Sajjanar Started Sanghamitra Program : సంఘమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ సజ్జనార్‌

CP Sajjanar Started Sanghamitra Program : సంఘమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ సజ్జనార్‌
x
సీపీ సజ్జనార్ ఫైల్ ఫోటో
Highlights

CP Sajjanar Started Sanghamitra Program : సైబరాబాద్ పోలీసుల ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మరో ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే శనివారం సైబరాబాద్ పోలీస్...

CP Sajjanar Started Sanghamitra Program : సైబరాబాద్ పోలీసుల ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మరో ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సంఘమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూమ్ అప్ ద్వారా ఈ కార్యక్రమంలో సినీ నటి అమల, మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంఘమిత్ర వాలంటీర్లు మానసిక కుంగుబాటుకు గురవుతున్నవారికి అండగా నిలవనున్నారు. అంతే కాదు సైబరాబాద్ సెక్యురిటి కౌన్సిల్ కూడా మహిళలకు అండగా ఉండనుంది. పోలీసులకు భాదితులకు మధ్య వారధిగా సంఘమిత్ర వాలంటీర్లు వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి రక్షించడానికి కోసం ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. సంగమిత్ర కార్యక్రమం అందరి కోసం ఏర్పాటు చేశామన్నారు. 2 వేల మంది ట్రాఫిక్ వాలంటీర్స్ ద్వారా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నామన్నారు. మహిళల కోసం షి షటిల్ 9 టీమ్స్ ద్వారా అనేక విధాలుగా అందరికీ దగ్గరయ్యామాన్నారు. మహిళలు, యువతుల పట్ల వేధింపులకు పాల్పడితే శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో డయల్ 100 పైన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. డయల్ 100కి ఎలాంటి కాల్స్ వస్తున్నాయో పర్యవేక్షిస్తున్నామన్నారు. పెట్రోలింగ్ వ్యవస్థ బలోపేతం అయిందని తెలిపారు. చిన్నారులు, మహిళ భద్రత కోసం 13 షి టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. దీనిపై పర్యవేక్షించడానికి ఒక టీమ్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఫిర్యాదులపై వెంటనే స్పందించేందుకు అన్ని విధాలా ఏర్పాట్లు కూడా చేశామన్నారు.

మహిళలకు ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. 760 మార్గదర్శక్, సంగమిత్ర గ్రూపులు ఉన్నాయన్నారు. సంగమిత్ర గ్రూపులో ప్రతి ఒక్కరూ మెంబర్ షిప్ తీసుకోవాలని సూచించారు. సెక్యూరిటీ, సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు సమస్యలు ఎదురైతే అందులో తెలపండి. ఎలాంటి ఉల్లంఘన జరిగినా మా దృష్టికి తీసుకు రండి.




Show Full Article
Print Article
Next Story
More Stories