తెలంగాణ ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా ఇవాళ సీపీ రాధాకృష్ణన్ ప్ర‌మాణం

CP Radhakrishnan Will Take Oath Telangana Governor  Today
x

తెలంగాణ ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా ఇవాళ సీపీ రాధాకృష్ణన్ ప్ర‌మాణం

Highlights

Telangana: నేడు ఉ.11.15 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం

Telangana: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్​ ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. నేడు ఉదయం 11 గంటల 15 నిమిషాలకు రాజ్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీపీ రాధాకృష్ణన్​హైదరాబాద్‌కు చేరుకున్నారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ ఆయనకు అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. దీంతో తెలంగాణకు వరుసగా మూడో తమిళ వ్యక్తి గవర్నర్‌గా నియమితులయ్యారు.

మరోవైపు తెలంగాణ గవర్నర్‌తో పాటు, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించటం పట్ల ఝార్ఖండ్​గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ స్పందించారు. తనపై నమ్మకంతో అదనపు బాధ్యతలు అప్పగించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ రెండ్రోజుల క్రితం రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. అనంతరం తెలంగాణకు నూతన గవర్నర్​గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా నేడు తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బాధత్యలు స్వీకరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories