జీహెచ్ఎంసీ కార్యాలయంలో కరోనా కలకలం..

జీహెచ్ఎంసీ కార్యాలయంలో కరోనా కలకలం..
x
Highlights

కరోనా మహమ్మారిని నివారించేందుకు ప్రభుత్వం ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా వైరస్ ను కట్టడి చేయలేక పోతుంది

కరోనా వైరస్ మహమ్మారిని నివారించేందుకు ప్రభుత్వం ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా వైరస్ ను కట్టడి చేయలేక పోతుంది. దీంతో కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిదిలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరో కొత్త కరోనా కేసు నమోదైంది. దీంతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం సిబ్బంది, అలాగే జీహెచ్ఎంసీ సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు.

మేయర్‌ పేషీలో పనిచేస్తున్న అటెండర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు నిర్దారణ కావడంతో అధికారులు మేయర్‌ ఛాంబర్‌ను మూసివేసి శానిటైజ్‌ చేశారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి జీహెచ్ఎంసీ కమీషనర్, హైదరాబాద్ కలెక్టర్, ఇతర అధికారులతో కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి సంజయ్ జాజు చర్చించారు. కొవిడ్‌-19 ఇతరులకు సోకకుండా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. కరోనా పరీక్షలు చేయించుకోవాలని హెల్త్‌ సెక్షన్‌లో పని చేసే సుమారు 40 మంది సిబ్బందికి సమాచారం అందించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే కాక అనేక ప్రభుత్వ ఆఫీసులలో కరోనా కేసులు నయోదవుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories