Telangana: తెలంగాణ వైద్య శాఖ కీలక నిర్ణయం

COVID Vaccine Second Dose to Begin from Today in Telangana
x

కరోనా వ్యాక్సిన్(ఫైల్ ఇమేజ్ )

Highlights

Telangana: రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ తొలి డోస్‌కి విరామం పడనుంది.

Telangana: రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ తొలి డోస్‌కి విరామం పడనుంది. ఇప్పటికే తొలిడోసు తీసుకున్న వారి కోసం ఇవాళ్టి నుంచి ఈ నెల 15వరకు రెండోడోసు మాత్రమే ఇచ్చేలా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. కేవలం రెండో డోసు టీకా మాత్రమే ఇస్తామని ప్రకటించింది. వ్యాక్సిన్ల నిల్వలు తక్కువగా ఉండటం రెండో డోసు కోసం ఎదురుచూస్తున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈ నెల 12 వరకు నాలుగు రోజులపాటు ఈ వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగనుంది. ఇప్పటికే కొవాగ్జిన్ తొలిడోస్ తీసుకుని 28రోజులు, కొవీషీల్డ్ తీసుకుని ఆరు వారాలు దాటిన వారికి టీకా అందించనున్నారు. తొలిడోసు ఎక్కడ తీసుకున్నా నేరుగా ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకోవచ్చని స్పష్టంచేసింది. ఇందుకోసం ఎలాంటి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు అక్కర్లేదని వ్యాక్సిన్ కేంద్రంలోనే లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

రాష్ట్రంలో ప్రభుత్వ , ప్రైవేటులో వ్యాక్సిన్ వేసుకున్న వారిలో సుమారు 5 లక్షల మందికి వచ్చే వారం రోజుల్లో రెండో డోస్ వ్యాక్సినేషన్ తప్పక పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే పలువురు కొవీషీల్డ్ వేసుకున్నవారు దాదాపు ఏడు వారాలు పూర్తి చేసుకోగా కొవాగ్జిన్‌ వేసుకున్న 28 రోజులు పూర్తై రెండో డోస్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు రెండో డోసుకూ సరిపోని పరిస్థితి ఉందని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

రెండో డోసు కోసం వెళ్తున్నవారు వెంటతీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాలు ప్రభుత్వం ప్రకటనలో వివరించింది. తొలిడోసు సందర్భంగా ఇచ్చిన గుర్తింపు కార్డునే రెండోసారికి వెంటతీసుకెళ్లాలి. ఫోన్‌ నంబరూ మొదటిసారి ఇచ్చిందే ఇప్పుడూ ఇవ్వాలి. మొదటి టీకా పొందినట్లుగా ఫోన్‌ నంబర్‌కు వచ్చిన మెసేజ్‌ చూపించినా సరిపోతుంది. తొలిడోసు పొందినట్టు ధ్రువపత్రం చూపినా సరిపోతుందని తెలిపింది. వ్యాక్సిన్‌ పంపిణీ పెంచాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారని సరిపడా డోసులు రాగానే 18నుంచి 45 ఏళ్లవారికి వ్యాక్సిన్‌ ప్రారంభిస్తామని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories