Telangana: ఇవాళ్టి నుంచి కోవిడ్‌ టీకా పంపిణీ పునఃప్రారంభం

Covid Vaccine Distribution Resumes From Today in Telangana
x

తెలంగాణలో కరోనా వాక్సినేషన్ పునః ప్రారంభం (ఫైల్ ఇమేజ్)

Highlights

Telangana: అన్ని ప్రభుత్వ కేంద్రాలు, వైద్యశాఖ అనుమతి పొందిన సెంటర్లలో వ్యాక్సినేషన్

Telangana: ఇవాళ్టి నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ ఫస్ట్‌ డోస్‌ పంపిణీ తిరిగి ప్రారంభం కానుంది. అన్ని ప్రభుత్వ కేంద్రాలతో పాటు వైద్యశాఖ అనుమతి పొందిన సెంటర్లలోనూ వ్యాక్సిన్‌ వేయనున్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో 74 మొబైల్‌ వ్యాక్సిన్‌ వాహనాల ద్వారా వ్యాక్సినేషన్‌ నిర్వహించనున్నారు. మార్కెట్లు, ఆఫీస్‌లు, బ్యాంకులు, షాపింగ్‌ మాల్స్‌ తదితర ప్రాంతాల్లో అందుబాటులో ఉండే ఈ వెహికల్స్‌లో మొదటి డోసుతో పాటు.. నిర్దేశిత గడువు పూర్తిచేసుకున్నవారికి రెండో డోసు కూడా ఇవ్వనున్నారు.

ఇదిలా ఉండగా.. కరోనా వ్యాక్సినేషన్‌పై ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. గతంలో.. ఫస్ట్ డోస్‌, సెకండ్‌ డోస్‌ వేరు వేరు వేసుకుంటే.. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోపణలు ఉండేవి. అయితే.. మొదటి డోస్‌, రెండో డోస్‌ వేరు వేరు కంపెనీల వ్యాక్సిన్లు వేసుకోవడం ద్వారా.. యాంటీబాడీస్‌ డవలప్‌ అవుతాయని, దీనిద్వారా సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా తక్కువగానే ఉంటాయని ICMR సర్వే చెబుతోంది. అంతేకాదు.. రెండు డోసులు ఒకే కంపెనీవి వేసుకొని, బూస్టర్‌ డోస్‌ లాగా ఇంకో కంపెనీ వ్యాక్సిన్‌ తీసుకుంటే.. ఫుల్‌గా యాంటీబాడీస్‌ పెరుగుతాయంట.

మొదటి డోస్‌ కోవిషీల్డ్‌ తీసుకున్నవారు.. రెండో డోస్‌ కింద కోవాగ్జిన్‌ తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. రకరకాల విడతల వారీగా జరుగుతున్న కరోనా వైరస్‌ దాడిపై ఈ మిక్స్‌డ్‌ వ్యాక్సిన్‌ బాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో మే, జూన్‌ నెలల్లో ICMR నిర్వహించిన ఓ సర్వేలో కూడా మిక్స్‌డ్‌ వ్యాక్సిన్‌ మంచి ఫలితాలను ఇస్తోందని వెల్లడైంది. అయితే.. ఈ మిక్స్‌డ్‌ వ్యాక్సిన్‌పై మరింత లోతుగా అధ్యయనం చేయాలని కేంద్ర ఆయుష్‌ పరిశోధన నియంత్రణ సంస్థ నిపుణులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories