పోలీసులకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం

పోలీసులకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం
x

పోలీసులకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం

Highlights

*వ్యాక్సిన్‌ తీసుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భగవత్‌ *రాష్ట్రంలో ఉన్న 60 వేల మందికి పైగా ఉన్న పోలీసులకు వ్యాక్సినేషన్ *నాలుగు రోజుల పాటు కొనసాగనున్న వ్యాక్సినేషన్

ఫ్రంట్‌ వారియర్స్‌గా ఉన్న పోలీసులకు కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భగవత్‌తో పాటు పలువురు పోలీస్ అధికారులు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు. ఎలాంటి అపోహలు లేకుండా అందరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఫ్రంట్‌ వారియర్స్‌గా కృషి చేసిన పోలీసులకు కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రంలో ఉన్న 60 వేల మందికి పైగా ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి నాలుగు రోజుల పాటు వాక్సినేషన్ ఇవ్వనున్నారు.

హైదరాబాద్‌ తిలక్‌నగర్‌లోని అర్బన్ హెల్త్ ప్రైమరీ ఆరోగ్య కేంద్రంలో డీజీపీ మహేందర్ రెడ్డి వాక్సిన్ వేసుకున్నారు. ఇక రాచకొండ సీపీ మహేష్ భగవత్ సైతం మల్కాజిగిరిలోని ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ వేయించుకున్నారు.

అయితే కరోనా వ్యాక్సిన్‌పై భయాందోళనలు పెట్టుకోవద్దని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, వ్యా్క్సి్న్‌ వేయించుకోవాలని డీజీపీ పిలుపునిచ్చారు. ఈ వ్యాక్సిన్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ సేఫ్‌ అని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.

పోలీస్‌ బాసులు వ్యాక్సిన్‌ తీసుకోవడంతో సిబ్బంది ఎంతో ఉత్సాహంగా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న పోలీసులు నాలుగు వారాల అనంతరం రెండో డోస్ తీసుకోవాలని వైద్యాధికారులు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories