Vaccination: రేపటి నుంచి టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్

Covid Vaccination to TSRTC Employees
x

Image Source: The Hans India 

Highlights

Vaccination: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు కూడా రేపటి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు.

Vaccination: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు కూడా రేపటి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. వ్యాక్సిన్ స్టాక్ పెరుగుతుండడంతో మెల్లమెల్ల సూపర్ స్పైడర్స్ గా గుర్తించిన వారికి వ్యాక్సినేషన్ ప్రకియను తెలంగాణ సర్కార్ షురూ చేసింది. అందులో భాగంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు కూడా ఆదివారం నుండి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ మొత్తం మూడు రోజుల పాటు కొనసాగనుంది.

తెలంగాణలో కరోనా వాహకులుగా భావిస్తున్న సూపర్ స్ప్రెడర్స్ కు శుక్రవారం నుండి వ్యాక్సినేషన్ వేస్తున్న విషయం తెలిసిందే.. ప్రభుత్వ రవాణా రంగంలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం ఈ వెసులు బాటు కల్పించలేదు..దీంతో ఆర్టీసీ ఉద్యోగులు తమకు కూడ వ్యాక్సినేషన్ చేయించాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం 45 సంవత్సరాలు పైపడిన ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సిన్ చేయించారు. అయితే అప్పుడు కూడ ఎక్కువగా ఆసక్తి చూపించలేదు..ప్రస్తుతం వారు విధుల్లోకి వెళ్లేందుకు బయపడున్నారు. దీంతో వ్యాక్సిన్ ఇప్పించకుంటే అసలు విధుల్లోకి రామని ఉద్యోగులు తేల్చి చెప్పారు. ఇదే విషయమై చర్చించిన ప్రభుత్వం ఆదివారం నుండి వారికి కూడ వ్యాక్సిన్స్ ఇప్పించాలని నిర్ణయించింది.

కాగా ఆటో డ్రైవర్స్ నుండి రేషన్ డీలర్లు, మార్కెట్ విక్రేతలతోపాటు జర్నలిస్టులు తదితర 20 కేటాగిరిల ప్రజలకు వ్యాక్సినేషన్ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది..దీంతో మొత్తం వీరంతా కలిసి 25 లక్షల వరకు ఉండచ్చొని అంచనా వేసింది.. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నుండి వీరికి ముందుగా టోకెన్లు ఇచ్చి వ్యాక్సిన్ వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories