తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు

Covid Positive Cases Are Increasing In Telangana
x

తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు

Highlights

* నిన్న ఒక్కరోజే 31 పాజిటివ్ కేసుల నమోదు

Covid Cases: తెలంగాణలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న మొన్నటిదాకా ఇన్ ఫ్లూయెంజా లక్షణాలతో బాధపడుతున్నవారు పెరిగారు. జలుబు, గొంతునొప్పితో వారంరోజులుగా ఇబ్బంది పడినవారు.. క్రమేణ కోలుకున్నారు. తాజాగా కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రులను ఆశ్రయించే వారిసంఖ్య పెరిగింది. తెలంగాణలో ఒక్క రోజే 31 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్‌లోనే 9 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 63కేసులు యాక్టివ్ గా ఉన్నాయని అధికారిక సమాచారం.

కరోనా కనుమరుగైన తర్వాత... వివిధ వేరియంట్లల్లో కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పటికీ..పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నవారు, బూస్టర్ డోస్ వేసుకున్నారు. వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో వైరస్ వ్యాప్తిని నిరోధించగలిగిందని వైద్యనిపుణులు చెబుతున్నారు. రోజువారి పనులపై బయటకు వెళ్లేవారు కోవిడ్ జాగ్రత్తలు పాటించి, మాస్క్ వినియోగించడం వల్ల వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మితిమీరిన నిర్లక్ష్యం, జనం రద్ధీగా ఉండే ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించకపోడం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కోవిడ్ టెస్టులు చేయించుకోకుండా జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలతో ఆస్పత్రులను ఆశ్రయించే వారు కొందరైతే... నేరుగా మందుల షాపుల్లో స్వతహాగాతాత్కాలిక ఉపశమనం పొందేందుకు మందుబిళ్లలు వాడేవారు ఎక్కువయ్యారని సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసు లు క్రమంగా పెరుగుతున్నాయి .. ఇప్పటికే హెచ్ 3 ఎన్ 2 వైరస్ వేగంగా స్ప్రెడ్ అవుతున్న సమయం లోనే మరో సారి కరోనా విజృభింస్తుంది ... గడిచిన పది రోజులో వాతావరణం లో మార్పుల వల్లనా ప్రతి ఒకరు హాస్పిటల్ కి క్యూ కడుతున్నారు .. దీంతో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ పేషెంట్ లతో నిండిపోతుంది ..పెరుగుతున్న కరోనా కేసు ల గురించి భయపడాల్సిన అవసరం లేదు అని వైద్యులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories