Corona: కరోనా సంక్షోభంలోనూ కాసులకు కక్కుర్తి

Corona: కరోనా సంక్షోభంలోనూ కాసులకు కక్కుర్తి
x

కరోనా వైరస్ (ఫైల్ ఫోటో)

Highlights

Corona: ఆస్పత్రిలో చేరినప్పటినుంచి బయటకొచ్చేవరకు దోపిడీయే * చనిపోయి స్మశానవాటికకు చేరేవరకు అగచాట్లే

Corona: ఓ పక్క కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంటే మరోపక్క సంక్షోభం పేరిట కాసులకు కక్కుర్తి పడుతున్నారు. కరోనా కల్లోలం సృష్టిస్తున్నా కాసుల వేటను వదల్లేదు మనిషి. వైరస్‌ బారిన పడి కళ్లముందే జనం పిట్టల్లా రాలిపోతున్నా ఏమాత్రం కనికరం లేదు. కోవిడ్‌ బారిన పడి ఆస్పత్రిలో జాయిన్‌ అయినప్పటి నుంచి చనిపోయి స్మశానవాటికకు చేరే వరకు అడుగడుగునా అగచాట్లే. ఒక కోవిడ్‌ మృతదేహాన్ని ఖననం కోసం తరలించాలంటే జేబులో వేలకు వేలు ఉండాల్సిందే.

కరోనా సెకండ్​వేవ్ ​ఎఫెక్ట్‌ తీవ్రంగా ఉండడంతో రోజురోజుకు పాజిటివ్​కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా ప్రాణభయంతో ప్రైవేట్​హాస్పిటళ్లకు ఆశ్రయిస్తున్నారు. ఇక దీనిని ఆసరాగా చేసుకుంటున్న . లక్ష అడ్వాన్స్​కడితేనే బెడ్​అని, స్పెషల్​రూమ్​కు 20 వేలని, ఐసీయూకు 30 వేలు, మెడికల్, ల్యాబ్, డాక్టర్​చార్జీలంటూ రోజుకు 50 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. పేదలను పీల్చిపిప్పి చేస్తున్నారు.

ఒకవేళ పరిస్థితి విషమించి కరోనా పేషెంట్‌ మృతి చెందితే ఆస్పత్రి నుంచి స్మశానానికి తరలించేందుకు వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ఆసుపత్రుల ముందే ప్రైవేట్‌ అంబులెన్సులు, దళారులు ఈ దందాకు తెరలేపుతున్నారు. ఓ పక్క కరోనా బారిన పడి అయినవారు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు దుఃఖంలో మునిగిపోతే వారి మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ తడిసిమోపుడవుతోంది. అంత్యక్రియలకు 25 వేలకు తగ్గకుండా ఇష్టారాజ్యంగా డబ్బు గుంజేస్తున్నారు స్మశాన వాటికల నిర్వాహకులు. వారు చెప్పిన ఫీజులు చెల్లించ‌డం త‌ప్ప మృతుల కుటుంబాల‌కు మ‌రో మార్గం క‌నిపించ‌డం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories