Coronavirus Updates in Telangana: ఈరోజూ అదే స్థాయిలో.. తెలంగాణలో తగ్గని కరోనా ఉధృతి!

Coronavirus Updates in Telangana: ఈరోజూ అదే స్థాయిలో.. తెలంగాణలో తగ్గని కరోనా ఉధృతి!
x
Coronavirus Updates in Telangana 1831New cases registered in 24 hours
Highlights

Coronavirus Updates in Telangana: తెలంగాణలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. సోమవారం కొత్తగా రాష్ట్రంలో 1831 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి.

Coronavirus Updates in Telangana: తెలంగాణ లో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. సోమవారం కొత్తగా రాష్ట్రంలో 1831 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,733కు చేరుకుంది. ఇక కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 11 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 306 కు చేరింది. సోమవారం ఒక్క నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 1419 కేసులు వచ్చాయి.

ఇక మిగిలిన కేసులు రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్ జిల్లాలో 117, కరీంనగర్ జిల్లాలో 05, సంగారెడ్డిలో 03, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ అర్బన్,నిజామాబాద్, పెద్దపెల్లిలో 09, మెదక్, మంచిర్యాల్ లలో 20, ఖమ్మంలో 21, జగిత్యాల్ 04, మహబూబ్ బాద్, గద్వాల్, నారాయణపేట , యదాద్రి లలో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. ఇక అటు కరోనాతో ఇవ్వాలా ఒక్కరోజే 2078 మంది డిశ్చార్జ్ అయ్యారు.

కొత్తగా 2078 మంది కోలుకోవడంతో ఇప్పటివరకూ మొత్తం 14,781 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 10,646 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. ఇక సోమవారం కొత్తగా 6,383 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,22,218 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇదిలావుంటే గత నాలుగు రోజులుగా కరోనా నుంచి కోలుకొని పెద్ద సంఖ్యలో రోగులు డిశ్చార్జ్ అవ్వడం సంతోషాన్ని కలిగిస్తుంది.

కరోనా కట్టడికి ప్రభుత్వం కూడా పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టెస్టింగ్ సామర్ధ్యాన్ని జిహెచ్ఎంసీ తోపాటుగా మరికొన్ని జిల్లాల్లో భారీగా పెంచింది. ఇక కరోనాని మరింతగా కట్టడికి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంటైన్మేంట్ జోన్లలో ఈ నెల చివరి వరకు లాక్ డౌన్ ని పొడిగించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories