Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1,478 కరొనా పాజిటివ్ కేసులు నమోదు!

Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1,478 కరొనా పాజిటివ్ కేసులు నమోదు!
x
coronavirus (File Photo)
Highlights

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు గత కొద్ది రోజులుగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రంలో

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు గత కొద్ది రోజులుగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రంలో 1,478 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 42,496కి చేరుకుంది. ఇందులో ప్రస్తుతం 13,389 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1,410 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీనితో కోలుకున్న వారి సంఖ్య 28,075కి చేరుకుంది. ఇక ఇవ్వాలా ఏడుగురు కరోనాతో మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 403 కి చేరుకుంది. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క GHMC పరిధిలోనే 806 కేసులు ఉన్నాయి.

ఇక మిగతా జిల్లాల విషయానికి వచ్చేసరికి రంగారెడ్డి 91, మేడ్చెల్ 82, సంగారెడ్డి 20, ఖమ్మం 18, కామారెడ్డి 31, వరంగల్ అర్బన్ 51, కరీంనగర్ 77, యదాద్రి భువనగిరి, మహబూబాబాద్ 11, పెద్దపల్లి 35, నల్గొండ 35, సిరిసిల్లా 27, నాగూర్ కర్నూల్ 23, జనగాం 10, సిద్దిపేట 8, సూర్యాపేట 20, నిజామాబాద్ 11, ఆసిఫాబాద్ 11, వికారాబాద్ 17, నారాయణపేట 14 లలో కేసులు నమోదు అయినట్టుగా శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులిటెన్ లో పేర్కొంది.

ఇదిలావుంటే గత కొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకొని వారు పెద్ద సంఖ్యలో ఉండడం సంతోషాన్ని కలిగిస్తుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టెస్టింగ్ సామర్ధ్యాన్ని జిహెచ్ఎంసీ తోపాటుగా మరికొన్ని జిల్లాల్లో భారీగా పెంచింది. ఇక కరోనాని మరింతగా కట్టడికి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంటైన్మేంట్ జోన్లలో ఈ నెల చివరి వరకు లాక్ డౌన్ ని పొడిగించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories