Corona Second Wave: మహా ముప్పు..ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అలర్ట్

Corona Virus
x

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం

Highlights

Corona Second Wave: ఆదిలాబాద్ జిల్లాకు మహాముప్పు పొంచిఉంది. మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లోకి వైరస్‌ చొరబడుతోంది.

Corona Second Wave: ఆదిలాబాద్ జిల్లాకు మహాముప్పు పొంచిఉంది. మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లోకి వైరస్‌ చొరబడుతోంది. మహారాష్ట్ర చిరువ్యాపారులు, కొనుగోలుదారులు ఆదిలాబాద్‌ వైపు కదిలివస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రకు చెందిన కరోనా పేషెంట్లు కూడా ఇక్కడి దవాఖానల్లో అడ్మిట్‌ అవుతున్నారు. దీంతో స్థానిక జనం భయాందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర నుంచి మహాముప్పు తప్పదని టెన్షన్‌ పడుతున్నారు.

దేశం కరోనా వైరస్‌కి మహారాష్ట్ర హాట్‌స్పాట్‌గా మారింది. ప్రతి రోజు వేలాది కేసులు, పదుల సంఖ్యలో మరణాలు మహారాష్ట్రను వేధిస్తున్నాయి. అయితే మహారాష్ట్ర పక్కనే ఉన్న ఆదిలాబాద్‌ జిల్లాపై కూడా కరోనా ఎఫెక్ట్ మాములుగా లేదు. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ జిల్లాకు నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో కరోనా వైరస్‌ ఇక్కడ కూడా స్ప్రెడ్‌ అవుతుంది. ఇప్పటికే అనేకమంది కరోనా బారినపడ్డారు.

మహారాష్ట్ర ప్రజలు నిత్యం తమ ప్రాంతాల్లోకి వస్తున్నారని జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రకు రాకపోకలు సాగించే వారితో జిల్లాలో కరోనా విజృంభిస్తుందని జిల్లా ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్‌ జిల్లాలో వేలాదిమంది కరోనా బాధితులుగా మారారు. జిల్లాలోని ఆసుపత్రులన్నీ పేషంట్లతో నిండిపోయాయి. కొందరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

మహారాష్ట్రలోని నాందేడ్, యావత్ మాల్, అకోలా, నాగ్ పూర్, చంద్రాపూర్, వార్థ జిల్లాల్లో కరోనా తీవ్రంగా ఉంది. అయితే కరోనాను అడ్డుకునేందుకు ఆదిలాబాద్, మహారాష్ట్ర సరిహద్దుల గ్రామాల్లో రాకపోకలను నిషేధించారు. కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో కోవిడ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు పోలీసులు. జిల్లాలోకి వచ్చే వారికి పోలీసులు థర్మల్‌ టెస్ట్ చేసి పంపిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 44వ జాతీయ రహదారి డొల్లారా వద్ద, అలాగే తలమడుగు, లక్ష్మీపూర్ బోథ్ మండలంలోని ఘన్ పూర్, నిగిని వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లాలోని తిర్పెల్లి, తానూర్ మండలంలోని బెల్ తరోడ, బాసర సమీపంలోని బిద్రెళ్లి, సారంగాపూర్ మండలంలోని స్వర్ణ వద్ద కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు అధికారులు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని తిరిగి పంపిస్తున్నారు.

ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. మహారాష్ట్ర నుంచి ముప్పు ముంచుకంచే ప్రమాదం ఉంది. మరీ ఈ టైంలో జిల్లా అధికారులు చేపడుతున్న జాగ్రత్త చర్యలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories