TSRTC: కరోనాతో పీకల్లోతు అప్పుల్లోకి తెలంగాణ ఆర్టీసీ

Coronavirus Second Wave Effect on Telangana RTC
x

తెలంగాణా ఆర్టీసీ (ఫైల్ ఇమేజ్)

Highlights

TSRTC: సెకండ్ వేవ్‌తో ఆర్టీసీకి రూ.550 కోట్లు నష్టం

TSRTC: అసలే పీకల్లోతు నష్టాల్లో ఉన్నట్టువంటి సిటీ బస్సును కోవిడ్ మరింత ముంచింది. మొదటి దశ లాక్‌డౌన్‌తోనే కకావికమైన గ్రేటర్ ఆర్టీసీ సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపింది. సాధారణ రోజుల్లోనే కోటి నష్టంతో నడుస్తున్న థియేటర్ ఆర్టీసీ బస్సులు అదనపు నష్టాలను మూటగట్టుకుంది. సెకండ్ వేవ్‌తో దాదాపు 550 కోట్లు నష్టపోయినట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఆన్‌లాక్‌ ప్రారంభమైన ప్రయాణికులు సరిగ్గా ఎక్కక పోవడంతో ప్రస్తుతం 40శాతం బస్సులు మాత్రమే నడుస్తున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గ్రేటర్ ఆర్టీసీ పరిధిలో 29 డిపోలు ఉన్నాయి. గతంలో 2800 బస్సులు సిటీ పరిధిలో ఉండేవి. సమ్మె తర్వాత 2400-2500 బస్సులు నడుస్తున్నాయి. సాధారణ రోజుల్లో 70శాతం ఆక్యుపెన్సీ వచ్చేది. కరోనా సెకండ్ వేవ్‌ తర్వాత అన్‌లాక్‌ ప్రారంభమైన ప్రయాణికులు సరిగా బస్సుల్లో రాకపోవడంతో 40శాతం ఓఆర్ మాత్రమే వస్తోంది. గ్రేటర్ ఆర్టీసీ పరిధిలో ప్రతిరోజు 30 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు..

మొదటి దశ కరోనా సమయంలో గ్రేటర్ పరిధిలో దాదాపు ఆరు నెలలు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దాదాపు 50శాతం ఓఆర్ వస్తున్న సమయంలో సెకండ్ వేవ్ దెబ్బతీసిందని ఆర్టీసీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సెకండ్ వేవ్ తర్వాత గ్రేటర్ హైదరాబాద్‌లో బస్సులో ప్రారంభమైన ప్రజల నుంచి సరిగా స్పందన రావడం లేదని ఆర్టీసీ తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉందని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రయాణికులు లేకపోవడం వల్ల ప్రస్తుతం 40శాతం బస్సులు మాత్రమే నడుస్తున్నాయని అన్నారు. అంటే ప్రస్తుతం 1300 బస్సులు రోడ్డెక్కాయన్నారు.. మిగిలిన హైర్ బస్సులు వారికి అద్దెలు చెల్లించకపోవడంతో ఆ బస్సులను తిప్పడంలేదన్నారు.

లాభం కోసం కాకుండా ప్రజా రవాణా సామాన్య ప్రజల కోసం ఆర్టీసీ నామమాత్రపు ఛార్జీలతో బస్సులు నడుపుతున్నారు. దాంతో తీవ్ర నష్టాలు వస్తున్నాయి. మరోవైపు వ్యక్తిగత వాహనాలు పెరుగుతుండడం ప్రయాణికుల నుండి సహకారం తగ్గుతుండడంతో భవిష్యత్‌లో ఆర్టీసీ ఉనికికే ప్రశ్నార్థకంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories