తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగంపై కరోనా పంజా.. తాత్కాలిక సచివాలయంలో కరోనా కలకలం

తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగంపై కరోనా పంజా.. తాత్కాలిక సచివాలయంలో కరోనా కలకలం
x
Highlights

హైదరాబాద్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది అన్నీ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తోంది. తాత్కాలిక సచివాలయంలో పెరుగుతున్న కరోనా కేసులు ఉద్యోగులను ఆందోళనకు...

హైదరాబాద్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది అన్నీ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తోంది. తాత్కాలిక సచివాలయంలో పెరుగుతున్న కరోనా కేసులు ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా మహమ్మారి భయంతో విధులకు హాజరయ్యేందుకు జంకుతున్నారు సచివాలయ ఉద్యోగులు.

తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది ప్రభుత్వ యాంత్రంగం పైనా పంజా విసురుతోంది. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలాయాల్లో విజిటర్స్ కు అనుమతి నిరాకరించారు అత్యవసరమైతే తప్పా ఉద్యోగులు డ్యూటీలకు రావడం లేదు. తెలంగాణ తాత్కాలిక సెక్రటెరియట్ బిఆర్కే భవన్‌లో కరోనా విజృంభిస్తుండటంతో ఉద్యోగులు భయాందోళనకు గురౌతున్నారు. ఇప్పటికే 12 మంది ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో 7, 8 అంతస్తుల్లో ఉన్న ఆర్థిక శాఖ కార్యాలయానికి తాళం పడింది. ఇప్పుడు మూడో అంతస్తులో ఉన్న మైనారిటీ సంక్షేమ శాఖలో ముగ్గురికి, ఐదో అంతస్తులో ఉన్న వైద్యారోగ్య శాఖలో 10 మందికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ రెండు అంతస్తులూ మూతపడ్డాయి. దీంతో బిఆర్కే భవన్ లో పనిచేసే ఉద్యోగులు విధులకు రావాలంటే జంకుతున్నారు.

ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా పలువురు ఉద్యోగులు ఆసుపత్రిలో చేరగా వారితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న వారు హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్ళిపోతున్నారు. సచివాలయానికి వచ్చే ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుండటంతో రోజువారీ కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. దీంతో అధికారులంతా ఒత్తిడితో పనిచేయాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే సెక్రటేరియత్ తో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం మంది ఉద్యోగులు హాజరైతే సరిపోతుందని ప్రభుత్వం భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే కోవిడ్ నిబంధనలు పకబ్బందీగా అమలు చేస్తామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తున్నా సచివాలయానికి రావడానికి ఉద్యోగులు భయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories