గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి బంధువుల ఇక్కట్లు !

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి బంధువుల ఇక్కట్లు !
x
Highlights

Gandhi Hospital: తెలంగాణ రాష్ట్రంలో కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్న వారికి గాంధీ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే హాస్పిటల్‌లో...

Gandhi Hospital: తెలంగాణ రాష్ట్రంలో కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్న వారికి గాంధీ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే హాస్పిటల్‌లో వారి యోగక్షేమాలు ఎలా ఉన్నాయో అని బంధువులు నిత్యం ఆందోళన చెందుతున్నారు. కరోనా సోకిన వ్యక్తి ఐసీయూలో వెంటిలెటర్‌పై చికిత్స అందుతున్నప్పుడు వాళ్ల ఆరోగ్యం ఎలా ఉందని బయట ఉన్న వారి కుటుంబ సభ్యులకు కోఆర్డినేటర్ల ద్వారా సమాచారం అందించాలి. కాని ప్రస్తుతం గాంధీలో అలాంటి పరిస్థితులు లేకుండా పోయాయి.

తెలంగాణ రాష్ట్రంలో మొదటి కరోనా పాజిటివ్ కేసు వచ్చినప్పటి నుంచి గాంధీ ప్రత్యేక కోవిడ్ హాస్పిటల్‌గా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి అక్కడే చికిత్స అందిస్తోంది. తరువాత జిల్లాల్లో కూడ కోవిడ్ వార్డులు ఏర్పాటు చేసిన తర్వాత గాంధీతో వెంటిలేటర్ పైన ఉన్న క్రిటికల్ కేసులు మాత్రమే తీసుకుంటున్నారు. హాస్పిటల్ లోపలికి పాజిటివ్ వచ్చిన వారిని మాత్రమే క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వత బంధువులను ఎవరిని లోపలికి అనుమతించరు. పేషంట్ లోపలికి వెళ్లిన మొదటి రోజు నుంచి డిశ్చార్జి అయి బయటకు వచ్చే వరకు వారి యోగక్షేమాలు తెలియక ఆందోళన చెందుతున్నారు. గాంధీ ఆసుపత్రి దగ్గరున్న కరోనా బాధితుల బంధువుల గోడు ఒక్కొక్కరిది ఒక్కో రకం. తమ వారు లోపలికి వెళ్లి 17 రోజులు దాటిందని, ఇప్పటి వరకు ఎలా ఉన్నారన్న సమాచారం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజు డిశ్చార్జి అయ్యేవారిని చూస్తూ అందులో తమ వారు ఉన్నారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు.

గాంధీ హాస్పిటల్ ముందు వర్షంలో తడుస్తూ కరోన రోగుల బంధువుల ఎదురుచూపులు హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. లోపల తమ వారు ఎలా ఉన్నారో అని చెమర్చుతున్న కళ్ళతో ఎదురుచూడాల్సి వస్తుంది పాపం. కోలుకోవడానికి సమయం పట్టిన సరే కాని తమ వారు బతికే ఉన్నారనే వార్త తెలిస్తే చాలని ఎంతో మంది ఉన్నారు. లోపల ఉన్న రోగుల యోగక్షేమాలు బందువులకు చెప్పడానికి గాంధీ హాస్పిటల్‌లో కోఆర్డినేటర్లు ఉంటారు. కాని ప్రస్తుతం వారు ఎక్కడ కనిపించడం లేదు. ఫోన్ చేసినా ఎవరు స్పందించరు. డాక్టర్లని అడిగిన అక్కడ వందలాది రోగుల్లో వీళ్ల పెషంట్ ఎవరో కూడ చెప్పని పరిస్థితి నెలకొంది. కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పుడు ఎం జరుగుతుందా అని భయంభయంగా బతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటు ప్రభుత్వం, హాస్పిటల్ సిబ్బంది రోగుల యొగక్షేమాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.


Show Full Article
Print Article
Next Story
More Stories