కరోనా ఉగ్రరూపం: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా ఉగ్రరూపం: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
x
Highlights

తెలంగాణలో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనావైరస్‌ పాజిటివ్‌...

తెలంగాణలో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలు ఇవే..!

ప్రభుత్వ కార్యాలయాల్లో 50శాతం సిబ్బంది హాజరుకావాలి.

రొటేషన్‌ విధానంలో 50శాతం సిబ్బంది మాత్రమే పనిచేయాలి.

విడిగా చాంబర్లు ఉన్నవారు రోజూ రావాల్సిందే.

డ్యూటీ లేని ఉద్యోగులు హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లొద్దు.

గర్భిణీలు, ఇతర వ్యాధులతో బాధపడేవారు సెలవులను ఉపయోగించుకోవాలి.

అధికారుల డ్రైవర్లు పార్కింగ్‌లో కాకుండా పేషీలో ఉండాలి.

ఉన్నతాధికారుల అనుమతి లేనిదే సందర్శకులను కార్యాలయాల్లోకి అనుమతించకూడదు.

బీఆర్‌కే భవన్‌లో నాలుగో తరగతి ఉద్యోగులకు వారం విడిచి వారం విధులు.

ఈనెల 22 నుంచి జులై 4వ తేదీ వరకూ ఆదేశాలు అమల్లో ఉంటాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories