Coronavirus: హుస్సేన్ సాగర్ లో కరోనా జన్యు పదార్థాలు

Coronavirus Genetical References Founded at Hussain Sagar in Hyderabad
x

హుస్సేన్ సాగర్ లో కరోనా జన్యు పదార్థాలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Coronavirus: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ,సీసీఎంబీ సంయుక్తంగా నిర్వహించాయి.

Coronavirus: హైదరాబాద్ ప్ర‌జ‌ల‌ను క‌రోనా వైర‌స్ ఓ వైపు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటే.. భాగ్య‌న‌గ‌ర వాసుల‌కు శాస్త్రవేత్తలు ఆందోళ‌న క‌లిగించే వార్త ఒక‌టి చెప్పారు. హైద‌రాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లో కరోనా వైరస్ జన్యు పదార్థాలు కనపడ్డాయని బాంబ్ పెల్చారు. సాగర్ తో పాటు ఇతర చెరువుల్లో కూడా ఈ పదార్థాలు కనిపించాయని చెప్పారు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయాల్లో ఈ అధ్యయనం చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ అధ్యయనాన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ,సీసీఎంబీ సంయుక్తంగా నిర్వహించాయి. హుస్సేన్ సాగర్ తో పాటు నాచారం పెద్ద చెరువు, నిజాం చెరువులో కూడా కరోనా జన్యు పదార్థాలు కనిపించాయని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చెరువుల్లో ఈ జన్యు పదార్థాలు పెరగడం ప్రారంభమైందని తెలిపారు.

అయితే చెరువుల్లోని వైరస్ జన్యు పదార్థం మరింతగా విస్తరించలేదని చెప్పారు. భవిష్యత్తులో వస్తుందని భావిస్తున్న మూడో వేవ్ ను అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే, కరోనా వైరస్ నీటి ద్వారా వ్యాపించదనే విషయం ఒక అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories