పెళ్లిళ్లకూ తాకిన కరోనా సెగ.. నిలిచిపోయిన వందలాది వివాహాలు!

పెళ్లిళ్లకూ తాకిన కరోనా సెగ.. నిలిచిపోయిన వందలాది వివాహాలు!
x
Highlights

పెళ్లిళ్లకు కూడా కరోనా సెగ తగిలింది. వైరస్ దెబ్బకు వందలాది పెళ్లిలు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో ముహూర్తాలు అధికంగా ఉండటంతో రెండు నెలల...

పెళ్లిళ్లకు కూడా కరోనా సెగ తగిలింది. వైరస్ దెబ్బకు వందలాది పెళ్లిలు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో ముహూర్తాలు అధికంగా ఉండటంతో రెండు నెలల ముందే చాలా మంది పెళ్లి తేదీలు నిశ్చయించుకున్నారు. కరోనా దెబ్బతో ఊహించని పరిస్థితులు తలెత్తాయి.

పెళ్లిళ్లపై లాక్ డౌన్ ఎఫెక్ట్ - వందలాది పెళ్లిళ్లు వాయిదా - దేశ, విదేశాల్లో చిక్కుకున్న వధూవరులు - ఏప్రిల్‌, మే నెలల్లోనే అధిక ముహూర్తాలు - 2 నెలల ముందే పెళ్లి తేదిలు నిర్ణయం - మళ్లీ ముహుర్తంపై అనిశ్చితి.

పెళ్లిళ్లకు కరోనా దెబ్బ తగిలింది. ఒకటో, రెండో కాదు వందలాది పెళ్లిలు నిలిచిపోయాయి. ఏప్రిల్‌లో జరగాల్సిన వివాహాలన్నీ వాయిదాపడ్డాయి. మళ్లీ ఎప్పుడు జరుగుతాయో తెలియని అనిశ్చితి నెలకొంది. కరోనా భయం, లాక్‌డౌన్‌ ప్రభావమే దీనికి ప్రధాన కారణం.

పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలు విదేశాల్లో, మన దేశంలోనే వేర్వేరు ప్రాంతాలు, నగరాల్లో చిక్కుకుపోయారు. లాక్ డౌన్ తో వారి సొంత ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో మరికొన్ని పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో ముహూర్తాలు అధికంగా ఉండటంతో రెండు నెలల ముందే చాలా మంది పెళ్లి తేదీలు నిశ్చయించుకున్నారు. కరోనా దెబ్బతో ఊహించని పరిస్థితులు తలెత్తాయి.

లాక్ డౌన్ మరింత పొడిగిస్తారు అన్న వార్తల నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన పెళ్లిళ్లను వాయిదావేశారు. శుభలేఖలు పంచినవారు ప్రస్తుతం పెళ్లి వాయిదా పడిందని ఫోన్లలో సమాచారమిస్తున్నారు. కల్యాణ మండపాలు, హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు, కేటరింగ్‌, డెకరేషన్‌, లైటింగ్‌, బ్యాండ్‌, మ్యారేజ్‌ ఈవెంట్‌ నిర్వాహకులకు అడ్వాన్సులు చెల్లించేశారు. అడ్వాన్సులు తిరిగి వస్తాయా లేదో అన్న ఆందోళనతో పాటు ఇప్పటికే చేసిన ఖర్చులు ఏమవుతాయో తెలియని పరిస్థితిపెళ్లి కుటుంబాల్లో నెలకొంది. లాక్ డౌన్ తో ప్రస్తుతం పెళ్లిళ్లు వాయిదావేసుకున్నవారు మళ్లీ ముహుర్తాలు ఎప్పుడు కుదురుతాయోనన్న ఆందోళనలో ఉన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories