Coronavirus Effect on Bogatha Waterfall: కరోనా దెబ్బకు నిర్మానుష్యంగా బ్యూటీ స్పాట్లు

Coronavirus Effect on Bogatha Waterfall: కరోనా దెబ్బకు నిర్మానుష్యంగా బ్యూటీ స్పాట్లు
x
Highlights

Coronavirus Effect on Bogatha Waterfall: కరోనా దెబ్బకు బ్యూటీ స్పాట్లు నిర్మానుష్యంగా మారాయి. యాత్రికులతో సందడి చేసే అందాల ప్రాంతాలు కళతప్పి...

Coronavirus Effect on Bogatha Waterfall: కరోనా దెబ్బకు బ్యూటీ స్పాట్లు నిర్మానుష్యంగా మారాయి. యాత్రికులతో సందడి చేసే అందాల ప్రాంతాలు కళతప్పి కనిపిస్తున్నాయి. ములుగు జిల్లాలోని బోగత జలపాతం ఉప్పొంగి పోస్తున్నా జనాలు లేక బోసిపోయింది. అధికారుల అనుమతులు లేక కొందరు. కరోనాకు భయపడి మరి కొందరు మొత్తానికి జలపాతం వీక్షణ నిలిచిపోయింది.

తెలంగాణ నయాగారాగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా వాజేడు మండలంలోని బోగత జలపాతం ఉప్పొంగి పోస్తోంది. ఒకప్పడు బొగత అందాల వీక్షణకు నిత్యం వందలాదిగా తరలివచ్చేవారు. కానీ ఇప్పుడు కరోనా దెబ్బకు జలపాతం కళతప్పి కనిపిస్తోంది. కరోనా విజృంభిస్తుండడంతో అటవీశాఖ అధికారులు 98 రోజులుగా బోగత జలపాత వీక్షణకు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు నిరాశగా వెనుదిరుగుతున్నారు.

బొగత చుట్టుపక్కల గ్రామస్తులకు సైతం కరోనా భయం పట్టుకుంది. ఎక్కడి నుంచో వచ్చే పర్యాటకులతో వైరస్ సోకవచ్చని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి సమీపంలోనే పర్యాటకులను అడ్డుకొని వెనక్కి పంపిస్తున్నారు. దీంతో బోగత అందాలు అడవి కాసిన వెన్నెలను తలపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories